Mobile games
-
తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!
న్యూఢిల్లీ:మారాం చేస్తున్న పిల్లలకు అన్నం తినిపించాలన్నా, అల్లరి చేసినా, ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసు కోవాలన్నా తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్న మంత్రం దండం స్మార్ట్‌ఫోన్. ఇది ప్రస్తుత కాలంలో పిల్లలకు అడిక్షన్‌లా మారిపోయింది. ఇది ప్రమాదకర ధోరణి అని, పిల్లలకు, మైనర్లకు స్మార్ట్‌ఫోన్ దూరంగా ఉంచాలని నిపుణులు పదేపదే హెచ్చిరిచ్చుస్తున్నారు. తాజాగా పేరెంట్స్ గుండెలు గుభిల్లుమనే స్టోరీ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఇండియాలో మళ్లీ షురూ అయిన నేపథ్యలో ఈ షాకింగ్ న్యూస మరింత ఆందోళన రేపుతోంది ఇన్సైడర్ ప్రకారం చైనాకు చెందిన టీనేజ్ బాలిక (13) మొబైల్ గేమ్స్ కారణంగా తల్లి ఖాతాలోని మొత్తం సొమ్మును ఖతం చేసేసింది. అయితే స్కూలు నుంచి ఫోన్ వచ్చేవరకు బాలిక ఈ కుటుంబం ఈ విషయాన్ని పసిగట్టలేదు. స్కూల్లో ఎక్కువసేపు ఫోన్లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది. పే టూ ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్ అయిందని గుర్తించిన టీచర్ బాలిక తల్లిని అప్రమత్తం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే బాలిక తల్లి యివాంగ్‌కు బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవలం రూ. 5( 0.5 యువాన్ )మాత్రమే మిగలడంతో లబోదిబో మంది. (రిటర్న్ టు ఆఫీస్ గూగుల్ వార్నింగ్: ఉద్యోగులేమంటున్నారంటే!) నాలుగు నెలల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు తగలేసింది. అంతకాదు తన క్లాస్మేట్స్ గేమ్స్‌కు కూడా ఈమే చెల్లింపులు చేసింది ఇంటిలో డెబిట్ కార్డు కనిపించడంతో దాన్ని తన స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నానని, దాని పాస్‌వర్డ్‌ను తల్లి తనకు చెప్పిందని బాలిక చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే తల్లికి అనుమానం రాకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీలకు సంబంధించిన, మెసేజ్‌లు, ఇతర రికార్డులు అన్నింటినీ డిలీట్ చేసింది. (మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర) అయితే తన సహవిద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్లు ఒప్పుకుంది. వాళ్లు కూడా గేమ్ ఆడేందుకు డబ్బు డిమాండ్ చేశారనీ, వారికి పంపకపోతే, ఇబ్బంది పెట్టేవారని సదరు బాలిక వెల్లడించింది. అలాగే టీచర్‌కి చెబితే టీచర్ తన పేరెంట్స్‌కికి చెబితే, వారికి కోపం వస్తుందేనని భయపడినట్టు చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ యాప్స్ వైపు ఆకర్షితులవుతున్న యూత్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనాతో సహా అనేక దేశాలు గేమింగ్ వ్యసనంనుంచి మైనర్లను కాపాడే చర్యలను చేపడుతున్నాయి. -
ఆన్లైన్ గేమ్స్‌కు అడిక్ట్.. ప్రయాణికుల ప్రాణాలతో క్యాబ్ డ్రైవర్ చెలగాటం
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టే ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మొబైల్లో గేమ్స్‌కు అడిక్ట్ అయిన ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ప్యాసెంజర్లను సురక్షితంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సిన అతడు ఫోన్లో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒకట్రెండు నిమిషాలు కాదు.. చాలా సేపు. వెనకాల కూర్చున్న ప్యాసెంజర్ గేమ్ ఆడకుండా డ్రైవింగ్ చేయమని చెప్పినా అతడు పట్టించుకోలేదు. అలాగే నిర్లక్ష్యంగా కారును ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లాడు. కనీసం సీట్ బెల్టు ధరించమని చెప్పినా పట్టించుకోలేదు. డ్రైవర్ వెర్రి చర్యకు చిర్రెత్తిపోయిన ప్యాసెంజర్ రాజీవ్ సింగ్ ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. @CYBTRAFFIC driving while playing pic.twitter.com/RRUP7GXF2E — Rajiv Singh (@rajusingh0810) August 5, 2022 ఇతని పేరు రాజు. అరుదైన డ్రైవింగ్ స్టైల్ ఉన్నట్టుంది. ఫోన్లో గేమ్ ఆడుతూనే కారు నడపుతున్నాడు. అసలు ఇతడ్ని డెల్ సంస్థ క్యాబ్ డ్రైవర్‌గా ఎలా తీసుకుంది అని వాపోయాడు. రాజీవ్ షేర్ చేసిన వీడియో చూసి నగర పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ చోటు ఎక్కడని అడిగారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అని అతడు బదులిచ్చాడు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలుసుకుని పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. చదవండి: ‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
చైనాకు షాక్ : 4500 గేమ్స్ తొలగింపు
వాషింగ్టన్ : భారత్ నుంచి భారీ డిజిటల్ స్ట్రైక్స్‌ను చవిచూసిన చైనాకు దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ ఊహించిన షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్‌లోని 4500 మొబైల్ గేమ్స్‌ను తొలగించింది. గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించడంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గేమింగ్ లైసెన్స్ నింబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్ దానిలో భాగంగానే చైనా గేమ్స్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఎలాంటి చట్టపరమైన అనుమతి లేని గేమ్స్ కూడా యాప్స్‌లో ఉంచుతున్నారని, ఇక మీదట అలాంటి వాటికి ఆస్కారం లేకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. అయితే ఇదేమీ తాము ఉన్న ఫలంగా తీసుకున్న చర్య కాదని, లైసెన్స్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని గత ఏడాదే ప్రకటించినట్లు గుర్తుచేసింది. దీనిలో భాగంగానే ముందుగా విధించిన గడువు ప్రకారం జూన్ 30 నుంచి చైనాకు చెందిన గేమ్స్‌ను యాప్ నుంచి తొలగిస్తున్నామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) లైసెన్స్ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన అనంతరం చట్ట ప్రకారం అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరిణామం చైనా కంపెనీలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 45 వేలకోట్ల రూపాయల వరకు చైనా కంపెనీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ అంచనా వేస్తోంది. (టిక్‌టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా) -
మొబైల్ గేమ్స్ మోత
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సర్వం స్తంభించిపోయిన వేళ మొబైల్ గేమ్స్ మోత మోగిస్తున్నాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్ ఫోన్లలో డిజిటల్ గేమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. కాలక్షేపం కోసం టీవీల్లో కార్యక్రమాల్ని చూస్తున్న వారు కొందరైతే, ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలతో పాటు మొబైల్ గేమింగ్ యాప్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు వారాలుగా దేశంలో మొబైల్ గేమింగ్ యాప్‌లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. భారీగా పెరుగుతున్న యూజర్లు ► మొబైల్ గేమింగ్ సెక్టార్లో ‘గేమ్స్ 2 విన్’ యాప్ యూజర్లు బాగా పెరుగుతున్నారు. లాక్ డౌన్‌కు ముందు ఆ యాప్‌ను వినియోగించే వారు రోజుకు సగటున 12 లక్షల మంది పెరుగుతుండేవారు. రెండు వారాలుగా యూజర్లు రోజుకు 15 లక్షల మంది పెరుగుతున్నారు. ► బాజీ గేమ్’ యాప్‌నకు మరింత క్రేజ్ పెరుగుతోంది. ఆ యాప్ అందిస్తున్న ‘పోకర్ బాజీ’ గేమ్‌పై యువతలో ఆసక్తి ఉండటంతో గడచిన రెండు వారాల్లో ఆ యాప్ యూజర్లు 15 శాతం పెరిగారు. ► ఇప్పటివరకు చిన్న పట్టణాల వరకే పరిమితమైన ‘విన్ జో’ గేమింగ్ యాప్‌నకు నిప్పుడు మెట్రో నగరాల్లోనూ డిమాండ్ పెరిగింది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఆ యాప్ యూజర్ల సంఖ్య 41శాతం పెరిగింది. ► క్రికెట్ గేమింగ్ యాప్‌లకు క్రేజ్ అమాంతంగా పెరిగింది. ‘హిట్ వికెట్’, ‘రియల్ క్రికెట్’ గేమింగ్ యాప్‌ల యూజర్లు 15శాతం పెరిగారు. ► ‘గేమర్ జీ’ మొబైల్ యాప్ యూజర్లు కూడా పెరుగుతున్నారు. ‘పేటిమ్ ఫస్ట్ గేమ్స్’ యాప్ యూజర్లు 200 శాతం పెరిగారు. ► లాక్‌డౌన్‌కు ముందు మొబైల్ గేమింగ్ యాప్‌ల పీక్ టైం రాత్రి 7నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండేది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పీక్ టైమ్‌గానే ఉంటోంది. ► ఇదే సందర్భంలో స్టేడియంలలో జరిగే క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లను అనుసరిస్తూ మొబైల్ ఫోన్ల ద్వారా ఆటలు ఆడించే లైవ్ గేమింగ్ యాప్‌లు మాత్రం క్రీడా పోటీలు నిలిచిపోవడంతో లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. 2021 నాటికి 31 కోట్ల యూజర్లు దేశంలో గేమింగ్ యాప్‌ల మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని గూగుల్–కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2021నాటికి దేశంలో మొబైల్ గేమింగ్ యాప్‌ల యూజర్లు 31 కోట్లకు చేరుతారని అంచనా వేసింది. 2019లో రూ.6,200 కోట్లుగా ఉన్న మొబైల్ గేమింగ్ యాప్‌ల టర్నోవర్ 2021 నాటికి రూ.7 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. -
కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి చాప కింద నీరులా అన్ని దేశాలకు విస్తరించింది. దాని భయంతో గడప దాటాలాంటేనే జనాలు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వాలు సైతం గుంపులుగా వెళ్లకండి, సమూహాలుగా జత కట్టకండి అంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. మరి రోజంతా ఇంట్లో ఉండాలంటే అది అయ్యేపనేనా.. ఎన్నిరోజులని ఒంటరిగా స్వీయనిర్భందం చేసుకుంటాం. పోనీ అన్ని గంటలు ఒక్కరమే ఉండాలంటే మనకు తోడుగా ఓ వ్యాపకం ఉండాల్సిందే. దీనికి ఫోన్‌ను మించిన అవకాశం మరొకటి లేదు. కాబట్టి మీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కింద చెప్పుకునే గేమ్స్ వేసుకోండి. పైగా వీటిని ఎలాంటి రుసుము లేకుండా ప్లేస్టోర్‌లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. మరింకెందుకాలస్యం.. వెంటనే ఫోన్ అందుకో.. గేమ్ ఆడుకో.. ► ఎయిట్ బాల్ పూల్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్‌లో ఇది కూడా ఒకటి. ఇది తప్పకుండా మీకు మజా ఇస్తుంది. ప్రత్యర్థుకు పోటీనిస్తూ ఎక్కువ స్కోర్ సాధించుకునే అవకాశం ఉంది. ► సబ్వే సర్ఫర్స్: చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ మెచ్చే గేమ్ ఇది. ఓ పిల్లవాడు తన ఎదురుగా ఉండే కాయిన్స్‌ను అందుకుంటూ వెళ్లాలి. క్రమక్రమంగా వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే రైళ్లను ఢీ కొట్టకుండా తప్పించుకు పరుగెత్తాలి. ఎన్నిసార్లు ఆడినా అస్సలు బోర్ కొట్టదు. ఆడిన ప్రతిసారీ ఇంతకుమించి హైస్కోర్ చేయాలనే ఉద్దేశంతో మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది. (కోస్తా తీరంలో కంబళ.. ఎలా ఆడతారంటే) ► క్యాండీ క్రష్ సోడా సాగా: ఈ గేమ్ తెలియనివారు దాదాపుగా ఉండనే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది పాత గేమే అయినప్పటికీ ఇప్పటికీ దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ టూర్లు గట్రా అంటూ తిరిగే వారికి ప్రయాణంలో దీన్ని మించిన తోడు ఉండదు. ► లూడో కింగ్: ఇది తప్పకుండా మీకందరికీ సుపరిచితమైన గేమ్. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి ప్రత్యక్షంగా ఆడుకునేవాళ్లు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చాక దీన్ని కాస్త ఆధునీకరించి ఆన్లైన్లో పరోక్షంగా ఆడుతున్నారు. ఆఫ్‌లైన్‌లో కంప్యూటర్‌తో, ఇంటిసభ్యులతో ఆడుకునే సదుపాయం ఉండగా ఆన్లైన్లో ప్రపంచంలో ఎవరితోనైనా ఆడవచ్చు. ► ప్లేయర్స్ అన్నౌన్ బ్యాటిల్‌గ్రౌండ్స్(పబ్జీ): చివరగా చెప్పుకునే ఈ గేమ్ ఈపాటికే చాలామంది మొబైల్స్‌లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సాధారణ గేమ్స్ కన్నా ఇది కాస్త భిన్నం. అడ్వెంచర్స్‌ను ఇష్టపడేవాళ్లకు ఈ గేమ్ తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి పబ్జీ ఆడటానికి అలవాటుపడ్డారంటే.. ప్రపంచంలో ఏం జరుగుతున్నా అది మీకు సంబంధం లేనట్టే వ్యవహరిస్తారు. అంతలా అందులో తలమునకలవుతారు. ఈ గేమ్‌లో ఒకరినొకరు కాల్చిచంపుకునే విధ్వంసం కూడా ఉంటుంది. కానీ అది గేమ్వరకే పరిమితం. ఈ గ్రాఫిక్ గేమ్ ప్రస్తుత యూత్‌కు మోస్ట్ ఫేవరెట్ గేమ్‌గా నిలిచిపోయింది. (పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!) ఇలాంటి మరెన్నో గేమ్స్ ప్లేస్టోర్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచిని బట్టి వాటినీ ఓసారి ట్రై చేయండి. దీంతోపాటు టీవీలో కార్టూన్స్, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. కుదిరితే పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఈ విధంగా కరోనా భయాన్ని మీ దరి దాపుల్లోకి రాకుండా నిలువరించండి. కానీ, ఏదేమైనా వైద్యులు, ప్రభుత్వాల సూచనలు మాత్రం తూచ తప్పకుండా పాటించండి.. కరోనా భయానికి గుడ్‌బై చెప్పండి. -
మితిమీరుతున్న గేమ్స్
పటాన్చెరు టౌన్ : ఏటా సెల్‌ఫోన్ వినియెగదారులు పెరుగుతున్న కొద్ది సరికొత్త వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. సెల్‌ఫోన్ ఆధారంగా అందరినీ ఆకట్టుకునే ఐడియాలతో ఎన్నో సంస్ధలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. సెల్ ఫోనులో గేమ్స్ ఆడుతూ ఎంతో ఆనందించేవారు. చిన్నపాటి గేమ్స్‌కు ఉన్న ఆదరణను చూసే ప్రత్యేకంగా త్రీడి, జావా గేమ్స్‌ను తయారు చేసే సంస్ధలు పుట్టుకొచ్చాయి. వింత లోకంలోకి లాకెల్లే సెల్‌ఫోన్ గేమ్స్ ఎంతో ఆదరణ పొందుతూ ఓ కొత్త దొరణకి మార్గం ఏర్పరిచాయి. ఇదొక భారీ వ్యాపారంగా వర్ధిలుతూ యువత జీవన శైలిలో ఓ భాగమై పోయింది. సెల్‌ఫోన్ గేమ్స్‌లో దూసుకొస్తున్నాయి. రీడీపీ మొబైల్ నుంచి హర్డ్ బీట్స్ గేమ్స్‌ను డౌన్ లోడ్ చేసుకున్న కొన్ని రోజులకే మరొకటి కావాలనిపిస్తోంది. సృజనాత్మకతతో క్షణక్షణం ఆసక్తిని రేకెత్తించే ఆటలను మొబైల్ గేమింగ్ సంస్ధలు తయారు చేస్తున్నాయి. వేగంగా వ్యాప్తి... కొత్త మొబైల్ గేమ్ మార్కెట్లోకి వస్తేచాలు.. విద్యార్ధులు,యువత యువకుల్లో సమాచారం వేగంగా వ్యాపిస్తోంది.గేమ్స్ కు అలవాటు పడుతున్న వారంతా బృందాలుగా మారి పోతున్నారు. పాఠశాలలు, కళాశాలల కూడళ్లో›సమయం దొరికినప్పుడల్లా వీటి గురించి చర్చలు నడుస్తున్నాయి.సరదాలు షికార్లకు కొదవలేని సమయం దొరికినప్పుడల్లా వీటి గురించే చర్చలు నడుస్తున్నాయి.సరదాలు,షికార్లకు కొదవలేని సమయం కావడంతో వారు కొత్త దనం కోసం అర్రులు చాస్తున్నారు.ఎప్పటికప్పడూ అందివచ్చే సరి కొత్త సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నారు.ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ సంస్ధలు.ఇంటర్ నెట్లో గేమింగ్ వెబ్సైట్ల నుంచి డౌన్ల్డడ్ చేసుకుంట్ను వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ గేమ్స్‌తో జాగ్రత్త సుమీ.... మొబైల్ గేమింగ్‌తో కాలక్షేపం మాట అటుంచితే...ఇదొక వ్యసనంగా మారుతుందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.విద్యార్ధి దశలో విలువైన సమయాన్ని వృదా చేసుకుంటూ సెల్ఫోన్లకు అతుక్కు పోతున్నారు.ఇన్నాళ్లూ కంప్యూటర్ గేమ్స్‌తోనే సరిపెట్టుకునే వారంతా మొబైల్ గేమ్స్‌కు మారిపోతున్నారు.ఎందుకంటే సెల్‌ఫోన్ ఎక్కడికైన తీసుకెళ్లే వెసులుబాటు ఉండడటంతో ఈ పరిస్ధితి దాపురించింది.మొబైల్ గేమింగ్ వల్ల మానసిక ఆలసట,చదువు మీద ఏకాగ్రత లోపించడం వంటి దుష్ఫ్రభావాలు కూడా కలుగుతున్నాయి.వ్యసనపరులిగా మారితే మాత్రం ఎన్నో ప్త్రి కూల ప్రభావాలను చవిచూడాల్సి వస్తుంది.విద్యార్ధులు సెల్‌ఫోన్ ఆటలతో శారీరకంగా,మానసికంగా బలహీనులవుతున్నారు.ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది.విద్యలో వెనుక బడుతారు.ఫోన్ విద్యార్ధులు ఇతర పనుల పై ఆసక్తి చూపకుండా పోయే ప్రమాదం ఉంది. -
విరాట్‌పై మొబైల్ గేమ్స్
న్యూఢిల్లీ: మైదానంలో మెరుపులు మెరిపిస్తున్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఇక నుంచి మన స్మార్ట్ ఫోన్లో కూడా తన విన్యాసాలు ప్రదర్శించనున్నాడు. అయితే క్రికెటర్‌గా కాకుండా వివిధ రకాల గేమ్స్‌లో పాత్రధారుడిగా కనువిందు చేయనున్నాడు. ఈమేరకు ప్రఖ్యాత మొబైల్ గేమ్ డెవలపర్ నజారా టెక్నాలజీస్... కోహ్లిపై గేమ్స్‌ను అభివృద్ధి చేయడం తో పాటు మార్కెట్ చేసేందుకు కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఎస్ఈ)తో మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌తో మొబైల్, వెబ్, డీటీహెచ్‌లో కోహ్లిపై గేమ్స్ విషయంలో నజారాకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ‘లక్షలాది మంది తమ స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. నా యానిమేటెడ్ పాత్రతో విరాట్ కొహ్లి గేమ్‌ను రూపొందిస్తామని చెప్పగానే ఇది గొప్ప ఆలోచనగా అనిపించింది. నా అభిమానులను ఇలా కలుసుకోవడానికి ఇదో చక్కని అవకాశం. ఈ గేమ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని కోహ్లి అన్నాడు. -
గేమ్స్, యాప్స్ కోసం
న్యూఢిల్లీ: మొబైల్ సేవలందించే వొడాఫోన్ కంపెనీ, యానిమేషన్ దిగ్గజం డిస్నీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్స్, యాప్స్ అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ మాధుర్ బుధవారం తెలిపారు. వినియోగదారులు ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ గేమ్స్‌ను, యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు. వేరీజ్ మై వాటర్? వేరీజ్ మై మిక్కీ? వేరీజ్ మై పెర్రీ?, టాయ్ స్టోరీ తదితర గేమ్స్‌ను, యాప్స్‌ను వినియోగదారులు పొందవచ్చని పేర్కొన్నారు. ఇటీవలనే వొడాఫోన్ మ్యూజిక్, వొడాఫోన్ స్పోర్ట్స్ వంటి సర్వీసులను అందజేశామని తెలిపారు. గేమింగ్ బిజినెస్ వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు.