మితిమీరుతున్న గేమ్స్
మితిమీరుతున్న గేమ్స్
Published Tue, May 9 2017 4:36 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
పటాన్‌చెరు టౌన్ : ఏటా సెల్‌ఫోన్ వినియెగదారులు పెరుగుతున్న కొద్ది సరికొత్త వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. సెల్‌ఫోన్ ఆధారంగా అందరినీ ఆకట్టుకునే ఐడియాలతో ఎన్నో సంస్ధలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. సెల్ ఫోనులో గేమ్స్ ఆడుతూ ఎంతో ఆనందించేవారు. చిన్నపాటి గేమ్స్‌కు ఉన్న ఆదరణను చూసే ప్రత్యేకంగా త్రీడి, జావా గేమ్స్‌ను తయారు చేసే సంస్ధలు పుట్టుకొచ్చాయి. వింత లోకంలోకి లాకెల్లే సెల్‌ఫోన్ గేమ్స్ ఎంతో ఆదరణ పొందుతూ ఓ కొత్త దొరణకి మార్గం ఏర్పరిచాయి. ఇదొక భారీ వ్యాపారంగా వర్ధిలుతూ యువత జీవన శైలిలో ఓ భాగమై పోయింది. సెల్‌ఫోన్ గేమ్స్‌లో దూసుకొస్తున్నాయి. రీడీపీ మొబైల్ నుంచి హర్డ్ బీట్స్ గేమ్స్‌ను డౌన్ లోడ్ చేసుకున్న కొన్ని రోజులకే మరొకటి కావాలనిపిస్తోంది. సృజనాత్మకతతో క్షణక్షణం ఆసక్తిని రేకెత్తించే ఆటలను మొబైల్ గేమింగ్ సంస్ధలు తయారు చేస్తున్నాయి.
వేగంగా వ్యాప్తి...
కొత్త మొబైల్ గేమ్ మార్కెట్‌లోకి వస్తేచాలు.. విద్యార్ధులు,యువత యువకుల్లో సమాచారం వేగంగా వ్యాపిస్తోంది.గేమ్స్ కు అలవాటు పడుతున్న వారంతా బృందాలుగా మారి పోతున్నారు. పాఠశాలలు, కళాశాలల కూడళ్లో›సమయం దొరికినప్పుడల్లా వీటి గురించి చర్చలు నడుస్తున్నాయి.సరదాలు షికార్లకు కొదవలేని సమయం దొరికినప్పుడల్లా వీటి గురించే చర్చలు నడుస్తున్నాయి.సరదాలు,షికార్లకు కొదవలేని సమయం కావడంతో వారు కొత్త దనం కోసం అర్రులు చాస్తున్నారు.ఎప్పటికప్పడూ అందివచ్చే సరి కొత్త సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నారు.ఎస్‌ఎంఎస్ ద్వారా మొబైల్ సంస్ధలు.ఇంటర్ నెట్‌లో గేమింగ్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌ల్డడ్ చేసుకుంట్ను వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది.
ఈ గేమ్స్‌తో జాగ్రత్త సుమీ....
మొబైల్ గేమింగ్‌తో కాలక్షేపం మాట అటుంచితే...ఇదొక వ్యసనంగా మారుతుందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.విద్యార్ధి దశలో విలువైన సమయాన్ని వృదా చేసుకుంటూ సెల్‌ఫోన్లకు అతుక్కు పోతున్నారు.ఇన్నాళ్లూ కంప్యూటర్ గేమ్స్‌తోనే సరిపెట్టుకునే వారంతా మొబైల్ గేమ్స్‌కు మారిపోతున్నారు.ఎందుకంటే సెల్‌ఫోన్ ఎక్కడికైన తీసుకెళ్లే వెసులుబాటు ఉండడటంతో ఈ పరిస్ధితి దాపురించింది.మొబైల్ గేమింగ్ వల్ల మానసిక ఆలసట,చదువు మీద ఏకాగ్రత లోపించడం వంటి దుష్ఫ్రభావాలు కూడా కలుగుతున్నాయి.వ్యసనపరులిగా మారితే మాత్రం ఎన్నో ప్త్రి కూల ప్రభావాలను చవిచూడాల్సి వస్తుంది.విద్యార్ధులు సెల్‌ఫోన్ ఆటలతో శారీరకంగా,మానసికంగా బలహీనులవుతున్నారు.ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది.విద్యలో వెనుక బడుతారు.ఫోన్ విద్యార్ధులు ఇతర పనుల పై ఆసక్తి చూపకుండా పోయే ప్రమాదం ఉంది.
Advertisement
Advertisement