విరాట్‌పై మొబైల్ గేమ్స్
న్యూఢిల్లీ: మైదానంలో మెరుపులు మెరిపిస్తున్న భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఇక నుంచి మన స్మార్ట్ ఫోన్లో కూడా తన విన్యాసాలు ప్రదర్శించనున్నాడు. అయితే క్రికెటర్‌గా కాకుండా వివిధ రకాల గేమ్స్‌లో పాత్రధారుడిగా కనువిందు చేయనున్నాడు. ఈమేరకు ప్రఖ్యాత మొబైల్ గేమ్ డెవలపర్ నజారా టెక్నాలజీస్... కోహ్లిపై గేమ్స్‌ను అభివృద్ధి చేయడం తో పాటు మార్కెట్ చేసేందుకు కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఎస్‌ఈ)తో మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ డీల్‌తో మొబైల్, వెబ్, డీటీహెచ్‌లో కోహ్లిపై గేమ్స్ విషయంలో నజారాకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ‘లక్షలాది మంది తమ స్మార్ట్‌ఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు. నా యానిమేటెడ్ పాత్రతో విరాట్ కొహ్లి గేమ్‌ను రూపొందిస్తామని చెప్పగానే ఇది గొప్ప ఆలోచనగా అనిపించింది. నా అభిమానులను ఇలా కలుసుకోవడానికి ఇదో చక్కని అవకాశం. ఈ గేమ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని కోహ్లి అన్నాడు.