మెగా డీల్కు ఐడియా గ్రీన్ సిగ్నల్
మెగా డీల్కు ఐడియా గ్రీన్ సిగ్నల్
Published Mon, Mar 20 2017 10:15 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులార్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీసులను తమలో విలీనం చేసుకుని దేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించనున్నామని ఐడియా పేర్కొంది. దీంతో ఐడియా సెల్యులార్ షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. మార్కెట్లు 15 శాతం ర్యాలీ నిర్వహిస్తూ లాభాలు పండిస్తున్నాయి. విలీనం తర్వాత అవతరించబోయే కంపెనీలో వొడాఫోన్ 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది.
ఈ డీల్ ప్రకారం ఐడియా, వొడాఫోన్లు రెండూ చెరో ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉంటాయి. అయితే చైర్మన్ అపాయింట్ చేసే అధికారం మాత్రం ఐడియా చేతికే వెళ్లిపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ను అపాయింట్ మెంట్ ఇరు ప్రమోటర్లు నిర్ణయించనున్నారు. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42 శాతం వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు. ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్. ఐడియా, వొడాఫోన్ ల కలయిక టెలికాం సెక్టార్ కు పాజిటివ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement