సాక్షి,ముంబై: భారత్‌లో మూడవ అతిపెద్ద మొబైల్ సేవల ఆపరేటర్ ఐడియా సెల్యులర్ లిమిటెడ్ గురువారం భారీ నిధుల సేకరణ ప్రణాళను విడుదల చేసింది. వొడాఫోన్ విలీనానికి ముందు ఈ ఫండ్ రైజింగ్ ప్లాన్‌ను రివీల్ చేసింది. రూ.6750 కోట్ల నిధుల సేకరణ ప్రణాళికను గురువాం వెల్లడించింది. ముఖ్యంగా షేర్ల విక్రయం ద్వారా 35 బిలియన్ రూపాయలు సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రణాళికలో భాగంగా ఐడియా 326.6 మిలియన్ల షేర్ల అమ్మకం ద్వారా 32.5 బిలియన్ల రూపాయలను సమకూర్చుకోనుంది. ప్రిఫరెన్షియల్ బేసిస్ కింద షేరుకు రూ.99.5చొప్పున మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ కు విక్రయించనుంది. దీంతో ఆదిత్యా బిర్లా వాటా 42.4 శాతంనుంచి 47.2 శాతానికి పెరగనుంది. గత ఏడాది మార్చిలో వోడాఫోన్ తో ఈ విలీనాన్ని ప్రకటించింది. అతిపెద్ద భారత ఫోన్ క్యారియర్ సృష్టించేందుకు చేసుకున్న ఈ ఒప్పందం ఈ ఏడాది చివరకు ముగియనుంది. ఈ వార్తలతో ఇవాల్టి ట్రేడింగ్‌లో ఐడియా షేరు 3శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment