
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియాతో విలీనాంతరం అవతరించే కొత్త కంపెనీకి ‘వొడాఫోన్ ఐడియా’ పేరు పెట్టాలని ఐడియా తాజాగా ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పడే కంపెనీ దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. కంపెనీ పేరులో మార్పును నిర్ణయించడానికి జూన్ 26న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఐడియా తెలిపింది.
అలాగే ఇందులో ఎన్‌సీడీల ద్వారా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ అంశం చర్చకు రానుంది. కాగా ఐడియా, వొడాఫోన్ ఇండియా వాటి వ్యాపారాలను విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విలీనానికి టెలికం డిపార్ట్‌మెంట్ ఆమోదం తుది దశలో ఉంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వొడాఫోన్ కు 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా వాటాదారులకు 28.9% వాటాలు రావొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment