EGM
-
ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కంపెనీ ఈజీఎమ్(అసాధారణ సమావేశం) ఈ నెల 29న జరగనున్నది. ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ అభ్యర్థన మేరకు ఈ ఏజీఎమ్ జరుగుతోంది. కంపెనీ షేర్ల బదిలీ, టేకోవర్, సంబంధించి ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్’, ‘ట్యాగ్ ఎలాంగ్ రైట్’ తదితర అంశాలను తొలగించడానికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏఓఏ)లో సవరణ కోసం ఈ ఈజీఎమ్‌ను ఉద్దేశించారు. ఇండిగో కంపెనీలో నిర్వహణ పరంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్ గంగ్వాల్ ఆరు నెలల క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సెబీ జోక్యం చేసుకోవాలని గంగ్వాల్ కోరారు. దీంతో మరో ప్రమోటర్‌అయిన రాహుల్ భాటియాతో వివాదాలు చెలరేగాయి. రాకేశ్ గంగ్వాల్ గ్రూప్‌నకు 36.64 శాతం వాటా ఉండగా, రాహుల్ భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది. కంపెనీకి మంచిదే.... ఏఓఏ నుంచి కొన్ని అంశాలను(మూడు క్లాజులను) తొలగించడం, దానికి ఆమోదం పొందడం కంపెనీకి మంచిదేనని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ మూడు క్లాజుల తొలగింపు వల్ల ప్రమోటర్లు ఇరువురికి సమాన హక్కులు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్లాజుల తొలగింపునకు ఆమోదం లభించకపోతే, ప్రమోటర్ల పోరు మరికొంత కాలం కొనసాగుతుందని, అది షేర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కాగా కంపెనీ ఈజీఎమ్ ఈ నెల 29న జరగనున్నదన్న వార్తల కారణంగా బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ బీఎస్ఈలో 2.1 శాతం లాభంతో రూ.1,361 వద్ద ముగిసింది. -
ఐడియా, వొడాఫోన్ కొత్తపేరు.. వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియాతో విలీనాంతరం అవతరించే కొత్త కంపెనీకి ‘వొడాఫోన్ ఐడియా’ పేరు పెట్టాలని ఐడియా తాజాగా ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పడే కంపెనీ దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవిస్తుంది. కంపెనీ పేరులో మార్పును నిర్ణయించడానికి జూన్ 26న అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని ఐడియా తెలిపింది. అలాగే ఇందులో ఎన్సీడీల ద్వారా రూ.15,000 కోట్ల నిధుల సమీకరణ అంశం చర్చకు రానుంది. కాగా ఐడియా, వొడాఫోన్ ఇండియా వాటి వ్యాపారాలను విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విలీనానికి టెలికం డిపార్ట్మెంట్ ఆమోదం తుది దశలో ఉంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వొడాఫోన్ కు 45.1%, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26%, ఐడియా వాటాదారులకు 28.9% వాటాలు రావొచ్చు. -
టాటా సన్స్ ఈజీఎమ్‌కు లైన్ క్లియర్
ముంబై: టాటా సన్స్ కంపెనీ ఈ నెల 6న నిర్వహించతలపెట్టిన అత్యవసర సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. డైరెక్టర్ల బోర్డ్ నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడానికి టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్.. ఈ నెల 6న ఈ ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈజీఎమ్పై స్టే విధించాలని కోరుతూ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) తిరస్కరించింది. ఈ విషయాన్ని గత విచారణలోనే నిర్ణయించామని టాటా సన్స్ ఈజీఎమ్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని ఎన్సీఎల్టీ ధర్మాసనం పేర్కొంది. -
టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీపై వేటు!
వచ్చే నెల 6న ఈజీఎం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వచ్చే నెల 6న జరగనున్నది. సైరస్ మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని టాటా సన్స్ తెలిపింది. చైర్మన్‌గా తొలగించిన తర్వాత మిస్త్రీ టాటా గ్రూప్ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో నిరాధార ఆరోపణలు చేశారని, కంపెనీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేశారని పేర్కొంది. ఆయన కారణంగా టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయిందని, వాటాదారులకు పరోక్షంగా నష్టం వాటిల్లిందని వివరించింది. చైర్మన్‌గా మిస్త్రీని టాటా సన్స్ గతం ఏడాది అక్టోబర్ 24న తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ డైరెక్టర్‌గా ఉన్న టాటా గ్రూప్ కంపెనీల నుంచి ఆయనను తొలగించడానికి ఆయా కంపెనీలు ఈజీఎంలను కూడా నిర్వహించాయి. ఈజీఎంలు జరుగుతుండగానే ఆయన ఆరు టాటా కంపెనీల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు తనను చైర్మన్‌గా తొలగించినందుకు టాటా సన్స్, ప్రస్తుత చైర్మన్ రతన్ టాటాలపై సైరస్ మిస్త్రీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేశారు.