![దీపావళి కానుకగా... వొడాఫోన్ ఫ్రీ రోమింగ్! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51477076551_625x300.jpg.webp?itok=x-RO2Mgu)
దీపావళి కానుకగా... వొడాఫోన్ ఫ్రీ రోమింగ్!
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఇండియా తాజాగా తన వినియోగదారులకు దీపావళి (అక్టోబర్ 30) నుంచి నేషనల్ రోమింగ్‌లో ఫ్రీ ఇన్‌కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇకపై రోమింగ్‌లో ఉన్న యూజర్లు రెట్టింపు చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 30 నుంచి వొడాఫోన్ కస్టమర్లు దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. ఈ చర్య మా 20 కోట్ల మంది కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అని వొడాఫోన్ ఇండియా డెరైక్టర్ (కమర్షియల్) సందీప్ కటారియా తెలిపారు.