సక్సెస్ టీచర్లకు సన్మానం
Published Sun, Jul 17 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
– పీఆర్‌టీయూ కార్యక్రమంలో డీఈవో సుప్రకాష్
ఒంగోలు: సక్సెస్ టీచర్లకు సన్మానం అనేది ఒక స్ఫూర్తిదాయకమని, ఈ టీచర్లను రోల్‌మోడల్‌గా తీసుకొని మిగితా వారు కూడా ఈ విద్యా సంవత్సరం వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత సా«ధించేలా కృషిచేస్తారని ఆశిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి డీవీ సుప్రకాష్ అన్నారు. ఆదివారం స్థానిక ఆంధ్రకేసరి విద్యాకేంద్రం ఆవరణలో ప్రోగ్రెస్‌వ్ రికగై్జజ్డ్ టీచర్స్ యూనియన్ నిర్వహించిన సన్మాన సభకు డీఈవో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సబ్జక్టు టీచర్లను ఒంగోలులో సన్మానించడం శుభపరిణామమన్నారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, సభాధ్యక్షుడు అయిన యం.రామ్‌భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ 29 మండలాల్లో 926 మంది ఉపాధ్యాయులను సన్మానించామన్నారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే సన్మానిస్తామని పేర్కొన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు యం.కమలాకరరావు మాట్లాడుతూ సర్వీస్ రూల్స్ సాధనకు తమ సంఘం అవిరళ కృషి చేస్తుందన్నారు. తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి సాల్మన్‌రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించడం తనకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు డివిజన్‌లోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోగలమని ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, బి.రాజగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, ఎ.వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాసులు, మాధవరావు, యంవి రమణారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చివరగా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్‌రెడ్డి దంపతులను జిల్లా విద్యాశాఖ అధికారి సుప్రకాష్, రాష్ట్ర అధ్యక్షుడు కమలాకరరావులు ఘనంగా సత్కరించారు.
Advertisement
Advertisement