సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలకు పీఆర్‌టీయే పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
మిర్యాలగూడ : సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలకు పీఆర్‌టీయే పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే ధర్నాకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పల్‌రెడ్డి ఉపేందర్‌రెడ్డి, మాలోతు బాలాజీనాయక్, పి, యాదగిరిరెడ్డి, మామిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.