విద్యారణ్యపురి: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా పింగళి శ్రీపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హన్మకొండలో జరుగుతున్న పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన శ్రీపాల్‌రెడ్డి హన్మకొండలో స్థిరపడ్డారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్‌కు చెందిన బీరెల్లి కమలాకర్‌రావు మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సముద్రాల రాంన ర్సింహాచార్యులు ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికల పరిశీలకులుగా పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి వ్యవహరించారు. కాగా, పీఆర్‌టీయూ రాష్ట్ర నూతన కార్యవర్గంలో ప్రతీ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా 250 మంది, ఉపాధ్యక్షులుగా 250కి అవకాశం కల్పించారు. అలాగే 50 మంది మహిళా ప్రతినిధులను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment