
సాక్షి, హైదరాబాద్: పీఆర్‌టీయూ నూతన కార్యవర్గం సోమ వారం ప్రమాణ స్వీ కారం చేసింది. ఆది, సోమవారాల్లో జరిగిన యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వచ్చే రెండేళ్లకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. పీఆర్‌టీయూ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డిలు ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం వారితో పాటు 31 జిల్లాల నుంచి 149 రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నామినేట్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.