state council meeting of PRTU-TS
-
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ త్వరలో పూర్తి
గజ్వేల్: ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ సత్వర చెల్లింపులు, హెల్త్ కార్డుల అంశంపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ఉపాధ్యాయుల వేతనం చాలా ఎక్కువని గుర్తుచేశారు. మరోవైపు పక్క రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు సమస్యలపై కొట్లాడితే నిర్బంధిస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని పేర్కొన్నారు. తమది ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు. పెరిగిన తలసరి ఆదాయం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా పెరిగిందని, 2014కు ముందు 1.24 లక్షలుగా ఉంటే ప్రస్తుతం అది 2.70 లక్షలకు చేరుకుందని మంత్రి హరీశ్ చెప్పారు. దేశ తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా 1.48 లక్షలు ఉందని తెలిపారు. తెలంగాణ ఎదుగుదలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం సాచివేత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది బోరుబావులకు మీటర్లు పెట్టనందుకు రూ. 6 వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎం కింద రావాల్సిన రూ. 15 వేల కోట్లు కలుపుకొని మొత్తంగా రూ. 21 వేల కోట్లను ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం తెలంగాణకు నిలిపేసిందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 800 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 2,950కి పెంచామన్నారు. వచ్చే ఏడాది మరో 9 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శశిధరశర్మ, వెంకటరాజం, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
పీఆర్టీయూ నూతన కార్యవర్గం ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: పీఆర్టీయూ నూతన కార్యవర్గం సోమ వారం ప్రమాణ స్వీ కారం చేసింది. ఆది, సోమవారాల్లో జరిగిన యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో వచ్చే రెండేళ్లకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. పీఆర్టీయూ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డిలు ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం వారితో పాటు 31 జిల్లాల నుంచి 149 రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నామినేట్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. -
మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల
► రాష్ట్ర రాబడి తగ్గిపోతోంది.. ► ప్రజలు కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి ► అన్ని రంగాలపైనా ప్రభావం ► పీఆర్టీయూ-టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘మోదీ సార్ దెబ్బకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏ బ్యాంకు ముందు చూసినా 500 మంది వరకు ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అన్ని రంగాలపై పడింది. ప్రజలు కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది’ అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన పీఆర్టీయూ తెలం గాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. భూములు, నివాస స్థలాల రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయిందన్నారు. ఈ పరిస్థితి తాత్కాలికమా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం రూ.17వేల కోట్ల రుణమాఫీ నాలుగు విడత ల్లో ఇంకా ఓ విడత సొమ్ము బ్యాంక్‌లకు చెల్లిం చాల్సి ఉందన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పీఆర్సీ బకాయిల బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వాటన్నిం టినీ దశలవారీగా పరిష్కరిస్తు న్నామని, తాను కూడా వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడతా నన్నారు. పీఆర్సీ బకారుుల చెల్లింపు, ఉపాధ్యాయుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యా యుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. అందుకే చైల్డ్ కేర్ లీవ్, పండితులు, పీఈటీ అప్‌గ్రెడేషన్ చేశార న్నారు. అన్నింటికంటే ప్రధానమైన ఉపాధ్యా యుల ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో చర్యలు చేపడుతున్నారని, పరిష్కారం కోసం కేంద్రానికి ఫైలు పంపించారన్నారు. మరో మూడు ప్రధాన సమస్యలైన పూర్తి స్థాయిలో హెల్త్ కార్డుల అమలు, రూ.398 వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు ఇంక్రిమెంట్లు, పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వీటిపై సీఎం, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో మాట్లాడానని, వాటి అమలుకు మళ్లీ మాట్లాడతానన్నారని తెలిపారు. వీటిపై ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత తీసుకుం టుందన్నారు. విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలకు కృషి ప్రభుత్వం విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేలా కృషి చేస్తోం దన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 16న 2వేలకు పైగా ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్యక్రమంలో పాఠశాల ల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగిం దని, ఇందులో ఉపాధ్యాయులు బాగా పని చేశారన్నారు. ఒకప్పుడు బతకలేక బడిపం తులు అనే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోరుుందన్నారు. కనుక.. ప్రభుత్వ టీచర్లు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడటంలో కీలకంగా వ్యవహరించాలన్నారు. పీఆర్ టీయూ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, శంబీపూర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.