సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూ నేతలు కేంద్ర హోం శాఖను కోరారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణు గోపాలచారి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి గురువారం హోం శాఖ కార్యదర్శి దిలీప్ కుమార్‌ను ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు.
పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ క్యాడర్‌గా గుర్తిస్తూ రాష్ట్రపతి ఆమో దానికి ఉత్తర్వులు పంపాలని కోరారు. సర్వీస్ రూల్స్ ప్రతిపాదనలు పరిశీల నలో ఉన్నాయని, కేంద్ర హోం మంత్రి ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతికి పంపుతామని దిలీప్ కుమార్ హామీనిచ్చినట్లు సంఘం నేతలు తెలిపారు.
‘ఏకీకృత’ రూల్స్‌పై చర్యలు తీసుకోండి
Published Fri, Jan 20 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
Advertisement