హైదరాబాద్: ప్రతి ఆలోచననూ సినిమా తీస్తామంటే మనం ఏర్పరుచుకున్న కట్టుబాట్లుకు అర్థం ఉండదని రాంగోపాల్ వర్మను ఉద్దేశించి ఏపీ పీఆర్‌టీయూ అధ్యక్షుడు కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు అన్నారు. వర్మ తాను తీయాలనుకునే సావిత్రి చిత్రాన్ని సమాజం కోసం త్యాగం చేయాల్సిందేనని సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. యువతను రెచ్చగొట్టే సినిమాలు తీయడం సరికాదని హితవు పలికారు.
'శ్రీదేవి' పేరుతో రాంగోపాల్ వర్మ తీసుస్తున్న సినిమాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా సావిత్రి అని పేరు పెట్టిన వర్మ వివాదం రేగడంతో వెనక్కు తగ్గారు. సినిమా పేరు 'శ్రీదేవి'గా మార్చారు.
'తోచిందల్లా సినిమా తీస్తే కట్టుబాట్లెందుకు'
Published Tue, Oct 7 2014 4:37 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement