స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు | Swamy Goud under the large-scale irregularities | Sakshi
Sakshi News home page

స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు

Published Sun, Apr 17 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

Swamy Goud under the large-scale irregularities

హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపుల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీఎన్జీవో అధికారుల కాలనీ సం క్షేమ సంఘం ఉపాధ్యక్షుడు జె.రవీందర్‌రెడ్డి తదితరులు ఈ పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ వ్యాజ్యా న్ని హైకోర్టు సోమవారం విచారిం చనుంది. టీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో స్వామిగౌడ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి, రూ.419కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషనర్లు ఆరోపించారు. వాటర్ వర్క్స్, పారామెడికల్ సిబ్బంది, ఇతర జిల్లాల్లోని ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించారని, ఈ విషయాన్ని స్వామిగౌడ్ కూడా అంగీకరించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement