
అమరవీరుల కుటుంబాలకు చేయూత
తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, తెలంగాణ రాష్ట్రంలో వారికి అన్నివిధాలా న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, జిల్లా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు.
మొయినాబాద్, న్యూస్‌లైన్:
తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, తెలంగాణ రాష్ట్రంలో వారికి అన్నివిధాలా న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, జిల్లా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పేర్కొన్నారు. సోమవార ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన వీరు మండల పరిధిలోని పెద్దమంగళారానికి చేరుకున్నారు. తెలంగాణ అమరవీరుడు యాదిరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ‘మేం మీకు అండగా ఉన్నాం.. అధ్యైర్యపడొద్ద’ంటూ యాదిరెడ్డి తల్లి చంద్రమ్మను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఓదార్చారు.
యాదిరెడ్డికి నివాళులర్పించినవారిలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కనకయ్య, యు వజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి ఆంజేయులు, జిల్లా కార్యదర్శి కేబుల్‌రాజు, పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, పెద్దమంగళారం సర్పంచ్ గీతావనజాక్షి, పీఏసీఎస్ డెరైక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు నవీన్‌కుమార్, సునీల్, శ్రీనివాస్, మహేందర్ తదితరులున్నారు. కాగా అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ఎమ్మెల్యీ హరీష్‌రావు, టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వరరెడ్డిలు కలిసి రూ. లక్ష చెక్కును యాదిరెడ్డి తల్లి చంద్రమ్మకు అందజేశారు. అనంతరం ఈటెల రాజేందర్, స్వామిగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు మండల పరిధిలోని చాకలిగూడకు చేరుకుని.. ఇటీవల అమరుడైన జన్న మేహ ష్ భార్య రజితను ఓదార్చారు. ఆమెకు విశ్వేశ్వరరెడ్డి రూ.75వేల ఆర్థిక సహా యం అందించారు. అనంతరం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌కు చెందిన వీరనారి సరిత కుటుంబ సభ్యులకు, చేవెళ్ల మండలం ఊరెళ్లకు చెందిన అమరవీరు డు జంగయ్య కుటుంబ సభ్యులకు విశ్వేశ్వరరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.