తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఏర్పాడుతుందని తెలంగాణ రాష్ట సమితి పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు శుక్రవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల మాత్రం తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎవ్వరినీ రెచ్చగొట్టొద్దని ఆయన సూచించారు. మేం దంచుడు మొదలు పెడితే హైదరాబాద్లో ఎవ్వరూ ఉండరని స్వామిగౌడ్ సీమాంధ్ర ఉద్యోగుల నుద్దేశించి పేర్కొన్నారు.