k kesava rao
-
దద్దరిల్లిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ బీసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కనీ్వనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేశ్, రాజ్‌కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ నాయకత్వం వహించిన మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 129 బీసీ కులాలకుగాను 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత 35 సంవత్సరాల్లో 70సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు– ప్రదర్శనలు నిర్వహించామని... శాంతియుతంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: కేకే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే పథకాలు వేగంగా అమలు జరుగుతాయని అన్నారు. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని కేకే తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని లింగయ్య యాదవ్ అన్నారు. -
గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని గవర్నర్ వ్యవస్థపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగాలని బీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొని పార్టీ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి రావడం వంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఢిల్లీ, తమిళనాడు, కేరళసహా అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నాయని.. అందువల్ల గవర్నర్ వ్యవస్థతో పాటు సమాఖ్య వ్యవస్థపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. అంతేగాక అఖిలపక్ష సమావేశంలో రైతుల పంటల మద్దతు ధర రెట్టింపు చేయలేదన్న అంశంతో పాటు, నిరుద్యో గం అంశంపైనా చర్చ జరగాలని కోరామన్నారు. వీటితో పాటు పార్లమెంట్ సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదం కోసం ఏర్పాటు చేయడం కాదని... ప్రజా సమస్యలతో పాటు దేశంలోని అనేక సమస్యలపై చర్చ జరపాలని కోరా మని కేకే, నామా తెలిపారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సమస్యలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తి పోరాడతామని పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
-
జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులోని మేయర్ చాంబర్లో విజయలక్ష్మి, ఒకటవ అంతస్తులోని డిప్యూటీ మేయర్ చాంబర్లో శ్రీలత సర్వమత ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలు తీసుకునే ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌అలీ, ఈటల రాజేందర్, ఎంపీ కె.కేశవరావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తా : మేయర్ విజయలక్ష్మి నగర ప్రజలకు సేవ చేసేందుకు తన శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తానని సోమవారం మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. హైదరాబాద్ నగర మేయర్‌గా ప్రమాణం చేయడం తనకు లభించిన సంపూర్ణ గౌరవమని, అందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ! -
సీఎం కేసీఆర్‌తో కేకే భేటీ
హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై నియమించిన హైపవర్ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌కు ఆయన నివేదిక సమర్పించారు. కొత్తగా జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించనున్నారు. తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దసరా రోజున కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. -
'ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు ఆపే శక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు చట్టప్రకారం నడుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుపై గవర్నర్ నరసింహన్‌కు అధికారం లేదని, బాధ్యత మాత్రమే ఉందని కేశవరావు అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తెరపైకి వచ్చాక హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేశవరావు స్పందించారు. -
హక్కుల్లేని రాష్ట్రమెందుకు?
సాక్షి, హైదరాబాద్: సర్వహక్కులు లేని తెలంగాణ రాష్ట్రం ఎందుకు? అని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శాసనసభ్యుడు కె.తారక రామారావు, ఎంపీ జి.వివేక్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో సంపూర్ణ తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై హక్కుల్లోనూ, 10 జిల్లాల సరిహద్దుల్లోనూ ఏం కొంచెం తక్కువైనా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలు, నీళ్లు, నిధులు, కొలువులు వంటివాటిపై అధికారాల్లేకుంటే తెలంగాణ పునర్నిర్మాణం ఎలా సాధ్యమని కేకే ప్రశ్నించారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెడితే అది తెలంగాణ ప్రజలను కించపర్చినట్లేనని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ఆంక్షలు, షరతులు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 10 ఏళ్ల తర్వాత వారే బాధపడతారని ఏఐసీసీ ఇన్చార్జీ దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 60 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఆవేదనను ఇప్పటికే చాలాసార్లు దిగ్విజయ్ సింగ్‌కు వివరించామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సీమాంధ్రులు 6 లక్షలు మాత్రమే అని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చెప్పినా సీమాంధ్ర నేతలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 7 యూనివర్సిటీలుంటే సీమాం ధ్రలో 12 ఉన్నాయన్నారు. ఉద్యోగుల సంఖ్యపై కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్టుగా సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు పేర్కొనటం అబద్ధమని కేటీఆర్ చెప్పారు. దీన్ని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ చేశారు. ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేని తెలంగాణకోసం కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. నేడు ఢిల్లీకి కేసీఆర్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, కె.కేశవరావు జీవోఎంతో సమావేశమయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే శిక్షణా శిబిరాల ఉపన్యాసకులతో ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ సమావేశం కానున్నారు. శిక్షణా శిబిరాలకు దిశానిర్దేశం చేసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. -
అఖిలపక్షం పేరుతో విభజన ఆపొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మరోసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చెప్పారు. అఖిలపక్ష సమావేశం ద్వారా తెలంగాణ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నించకూడదని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. పార్టీ నాయకులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జి.వివేక్, స్వామిగౌడ్, వినోద్‌కుమార్, గోయల్, రమణాచారి, దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మళ్లీ మళ్లీ కమిటీల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాలయాపన చేయవద్దని ఈటెల కోరారు. విభజన నిర్ణయం నేపథ్యంలో 11 అంశాలపై కేంద్ర హోం శాఖ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు కోరుతూ రాసిన లేఖకు స్పందనగా తమ పార్టీ అభిప్రాయాలతో కూడిన 12 పేజీల నివేదికను జీవోఎంకు మెయిల్ ద్వారా పంపినట్టు నేతలు చెప్పారు. నివేదిక ప్రతిని పోస్టు ద్వారా కూడా పంపనున్నామన్నారు. జీవోఎంకు టీఆర్ఎస్ అందజేసిన నివేదిక వివరాలు క్లుప్తంగా... హైదరాబాద్ పోలీస్ తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విభజన నోట్లోనూ, సీడబ్ల్యూసీ తీర్మానంలోనూ హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను టీఆర్ఎస్ సమర్థిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ శాసనమండలిని కొనసాగించాలి. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అన్నది తాత్కాలిక వెసులుబాటే అయినందున ఆ ప్రభుత్వ నిర్వహణకు అన్నిరకాల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో అతిత్వరగా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి వారే ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నాం. శాంతిభద్రతలు పూర్తిగా రాష్ట్రం పరిధిలోనే ఉండే అంశం. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ సైతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. రాష్ట్ర విభజనతో పాటు రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను ఏర్పాటు చేయాలి. హైకోర్టులో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతి త్వరగా రెండుగా విడదీయాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన 371 డి కొనసాగించాలి. కృష్ణా నదీ జలాలలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మిగులు జలాలలో తెలంగాణ రాష్ట్రం తమ న్యాయమైన వాటా కోరే వరకు బ్రజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును అమలులోకి రాకుండా చూడాలి. ట్రిబ్యునల్ రాష్ట్రానికి అదనంగా 190 టీఎంసీల కృష్ణా నీరు వస్తుందని ప్రాథమికంగా తేల్చింది. ఇక్కడి పాలకులు ఈ నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతంలో లేని ప్రాజెక్టులకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా న్యాయమైన వాటా కోరేవరకు ట్రిబ్యునల్ తుది తీర్పు అమలు చే యరాదు. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం కోసం గోదావరి, కృష్ణా నదులపై ఒక్కో జాతీయ ప్రాజెక్టును నిర్మించాలి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర పరిధిలో ఉన్నప్పటికీ, దీని వల్ల ముంపునకు గురయ్యేది అధికంగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలే. అందువల్ల ముంపు బాధితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ ప్రకటించడంతో పాటు వన్యప్రాణి, అటవీ పర్యావరణ అనుమతుల తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలి. సింగరేణిపై పూర్తి హక్కులు తెలంగాణకే ఇవ్వాలి సింగరేణి బొగ్గు గనులపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న పూర్తి హక్కులను తెలంగాణ ప్రభుత్వానికి కల్పించాలి. సింగరేణిలో ఉన్న 51 శాతం రాష్ట్ర పూర్తి వాటాను తెలంగాణకు బదలాయించాలి. తెలంగాణ ప్రాంతానికి ఈ సరికే మంజూరు చేసిన రైల్వేలైన్లను పూర్తి చేయాలి. నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించాలి. మరో 1400 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాలో నిర్మించాలి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బొగ్గు గనుల నుంచి కేటాయించిన బొగ్గులో 60 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలి. 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్ర ఆస్తులుగా ఉన్నవన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. అప్పట్లో ఢిల్లీలో ఉండే హైదరాబాద్ హౌస్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన భూములు, ఆంధ్రాభవన్ తెలంగాణకే చెందాలి. తెలంగాణ ప్రాంతంలో ఒక ఐఐఎం, జాతీయ స్థాయి మెడికల్ సైన్స్ సంస్థతో పాటు గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. 57 ఏళ్లలో జరిగిన నష్టానికి తగినవిధంగా ప్యాకేజీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత 57 ఏళ్లలో రూ.4.10 లక్షల కోట్ల తెలంగాణ ప్రాంత నిధులను వేరే ప్రాంతాలలో ఖర్చు పెట్టారు. దీనివల్ల మరో రూ.4.78 లక్షల కోట్ల ఆదాయం ఈ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ 57 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలోని 2. 5 లక్షల కుటుంబాలు రెండు తరాల పాటు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని 57 ఏళ్ల పాటు జరిగిన నష్టానికి ప్రతిఫలంగా ఈ ప్రాంతానికి తగిన ప్యాకేజీ ప్రకటించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు చాలా తక్కువమంది ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకారం తెలిపితే వారందరినీ ఇక్కడికి బదలాయించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సర్వీసు పుస్తకం పరిశీలించి ఎవరు ఏ ప్రాంత ఉద్యోగి అన్నది నిర్ధారించాలి. అక్రమంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఉద్యోగులు ఇక్కడే పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి తెలంగాణ ట్రెజరీ నుంచి కాకుండా అవతలి ప్రాంతంలో పెన్షన్ చెల్లింపు ఏర్పాట్లు జరగాలి. -
ఆమోదం పొందే వరకూ అప్రమత్తం
తెలంగాణను అడ్డుకునేందుకు ఢిల్లీలో సీమాంధ్రుల లాబీయింగ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేం దుకు సీమాంధ్ర నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ స్థాయిలో పెద్దఎత్తున లాబీ యింగ్ చేస్తున్నారని టీఆర్ఎస్ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ‘తెలంగాణ స్టేట్-ఇన్పుట్స్ టు జీఓఎం’ అనే అంశంపై‘యూనివర్సిటీ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ’ ఒక సమావేశం నిర్వహించింది. అందులో కేశవరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, పలువురు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించిన సమావేశంలో విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్టికల్ 371(డి), పింఛన్లు, వర్సిటీలు, నిధులు, నీళ్ళు, విద్యుత్తు, వనరులు, భూములు, రుణాలు, చెల్లింపులు, శాంతిభద్రతలు, రెవిన్యూ తదితర అంశాలపై చర్చలు జరిపారు. జీఓఎంకు పూర్తి వివరాలతో త్వరలో నివేదికను అందచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు ఉండాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, మాజీ ఎంపీ వినోద్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, విమలక్క, ఔటా అధ్యక్షులు భట్టు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ప్రొ.రాములు, ప్రధాన కార్యదర్శి ప్రొ.మనోహార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
విభజన గురించి సీఎంకు ముందే తెలుసు: వివేక్
హైదరాబాద్: అసెంబ్లీలో మెజార్టీ ఉంటే తెలంగాణ రాదనే వాదన సరికాదని టీఆర్ఎస్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. రాజ్యంగాన్ని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కొంతమంది పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యంగం ప్రకారమే రాష్ట్రపతి వ్యవరిస్తున్నారని అన్నారు. 371(D) పై ఎలాంటి అపోహలు వద్దని చెప్పారు. సీఎం కిరణ్ అబద్ధాలకోరని పెద్దపల్లి ఎంపీ వివేక్ విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని సీఎంకు ముందే తెలుసని, అయినా ప్రజలను మభ్యపెడుతున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీన అంశం ఉత్పన్నం కాదని, అలాంటి ప్రతిపాదన లేనేలేదని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణపై మాకున్న అవగాహన కాంగ్రెస్‌కు లేదన్నారు. పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై ఈ నెల 25న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. -
అమరుల త్యాగాల వల్లే తెలంగాణ: కేకే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఏర్పాడుతుందని తెలంగాణ రాష్ట సమితి పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు శుక్రవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల వల్ల మాత్రం తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఎవ్వరినీ రెచ్చగొట్టొద్దని ఆయన సూచించారు. మేం దంచుడు మొదలు పెడితే హైదరాబాద్‌లో ఎవ్వరూ ఉండరని స్వామిగౌడ్ సీమాంధ్ర ఉద్యోగుల నుద్దేశించి పేర్కొన్నారు. -
కెకె మీడియా సమావేశం 17th July 2013