
విభజన గురించి సీఎంకు ముందే తెలుసు: వివేక్
హైదరాబాద్: అసెంబ్లీలో మెజార్టీ ఉంటే తెలంగాణ రాదనే వాదన సరికాదని టీఆర్ఎస్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. రాజ్యంగాన్ని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కొంతమంది పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యంగం ప్రకారమే రాష్ట్రపతి వ్యవరిస్తున్నారని అన్నారు. 371(D) పై ఎలాంటి అపోహలు వద్దని చెప్పారు.
సీఎం కిరణ్ అబద్ధాలకోరని పెద్దపల్లి ఎంపీ వివేక్ విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని సీఎంకు ముందే తెలుసని, అయినా ప్రజలను మభ్యపెడుతున్నారని తప్పుబట్టారు.
కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీన అంశం ఉత్పన్నం కాదని, అలాంటి ప్రతిపాదన లేనేలేదని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణపై మాకున్న అవగాహన కాంగ్రెస్‌కు లేదన్నారు. పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై ఈ నెల 25న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు.