సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్, బీజేపీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలను అణచివేయడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
జాతీయ పార్టీల దివాళాకోరు రాజకీయాల వల్లే దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరిగిందన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజలను పక్కదారి పట్టించేం దుకే కాంగ్రెస్, బీజేపీలు టీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో ఆ పార్టీల ఎమ్మెల్యేల పాత్ర శూన్యం.
హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటున్నారు. దేశవ్యాప్తంగా మహా రాష్ట్ర, కర్ణాటకల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కు వ. తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర హోం శాఖ చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు టీఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment