హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై నియమించిన హైపవర్ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్కు ఆయన నివేదిక సమర్పించారు.
కొత్తగా జనగామ, సిరిసిల్ల, ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించనున్నారు. తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దసరా రోజున కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్తో కేకే భేటీ
Published Fri, Oct 7 2016 2:46 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
Advertisement
Advertisement