స్వామిగౌడ్ ను అడ్డుకున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను ఓయూజేఏసీ అడ్డుకుంది. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో జరిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల విద్యా సదస్సుకు మండలి చైర్మన్ స్వామిగౌడ్, కోదండరాం, దేవీప్రసాద్, విఠల్ లు హాజరయ్యారు.
ఈ సమావేశానికి నేతలు హాజరవుతున్నారని తెలుసుకున్న ఓయూ విద్యార్ధులు గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు.