regularisation
-
పాపం.. కాంట్రాక్ట్ లెక్చరర్లు!
‘కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించి వారి సర్వీసును క్రమబద్దీకరిస్తాం. ఈ బాధ్యత నేను తీసుకుంటున్నాను’.. ఏప్రిల్ 28న కోడుమూరు నియోజకవర్గం గూడూరులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ ఇది. కానీ.. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కాంట్రాక్టు లెక్చరర్లు కలిసి ఈ హామీని గుర్తుచేస్తే క్రమబద్దీకరణ కుదరదు పొమ్మన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ 2017 డిసెంబర్లో కాంట్రాక్టు లెక్చరర్లతో ముఖాముఖి సమావేశమై ‘ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుంటూ తీవ్ర అన్యాయం చేస్తోంది. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసేందుకు పోరాడుతా’.. అని హామీ ఇచ్చారు. ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖం కూడా చూపించలేదు. సాక్షి, అమరావతి : కాంట్రాక్టు లెక్చరర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఝులక్ ఇచ్చింది. ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని, వారి సర్వీసును క్రమబద్దీకరిస్తామని మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఆ అంశాన్నే పక్కన పెట్టేశారు. అంతేకాదు.. ఈ అంశం తమ మేనిఫెస్టోలో లేదని చెప్పడంతో కాంట్రాక్టు లెక్చరర్లు కంగుతిన్నారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు దాదాపు 7 వేల మందిని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2021లో తెలంగాణ ప్రభుత్వం అక్కడి కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కూడా క్రమబద్దీకరించేందుకు గతేడాది అక్టోబరులో నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. 2014 జూన్‌కు ముందు విధుల్లో చేరిన 10,117 మంది అర్హులను గుర్తించి క్రమబద్దీకరించాలని జీఓ–114 ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గతేడాది వైద్య, అటవీ, గిరిజన సంక్షేమ తదితర శాఖల్లో పనిచేస్తున్న 3 వేల మందిని రెగ్యులరైజ్ చేయగా, మిగిలిన వారి వివరాలు తీసుకునేసరికి ఎన్నికల కోడ్ అమలుతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆందోళనలో ఐదువేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు.. ప్రభుత్వం అర్హులుగా గుర్తించిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లే ఉన్నారు. వీరిలో ఇంటర్మీడియట్ విద్యలో 3,618 మంది, డిగ్రీ కాలేజీల్లో 695 మంది, పాలిటెక్నిక్ కళాశాలల్లో 309 మంది పనిచేస్తున్నారు. 2023 అక్టోబరులో చేసిన చట్టం ప్రకారం వీరినీ క్రమబద్ధీకరించేందుకు వారి వివరాలు, సర్వీసు, విద్యార్హతల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తిచేసి ఫైల్‌ను న్యాయ నిపుణుల సలహా కోసం పంపారు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. క్రమబద్దీకరణ కోసం అర్హులుగా గుర్తించిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరు మాత్రమే రెగ్యులర్ కావడంతో మిగిలిన వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పెర్ఫార్మెన్స్ పేరుతో కొత్త నిబంధన.. ఇదిలా ఉంటే.. ఏటా కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యువల్‌ను జూన్‌లో ఇవ్వాల్సి ఉండగా, ఈసారి మూడు నెలలు ఆలస్యంగా రెన్యువల్ చేశారు. అందులోనూ 3,618 మందిలో 558 మంది పనితీరు సరిగ్గాలేదని పక్కనపెట్టారు. పైగా.. ఈ విద్యా సంవత్సరం ఒప్పందంలో ‘పెర్ఫార్మెన్స్’ అనే కొత్త నిబంధనను తీసుకురావడం గమనార్హం. అంటే వచ్చే ఏడాది ఈ వంకతో ఎంతమందిని తొలగిస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. త్వరలో డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 350 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌కు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. కానీ, ఆ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది.మా గోడు ఆలకించండితమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుతూ పాదగయలో హోమం పిఠాపురం: ఎన్నికల ముందు తమకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో వినూత్న నిరసన నిర్వహించారు. ఎన్నో రోజులుగా తమ గోడు వినిపించుకోండంటూ ప్రభుత్వం వద్ద వాపోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో దేవుడి వద్ద తమ గోడు తెలుపుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు బీఎస్ఆర్ శర్మ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తమ సమస్యలను పట్టించుకోవాలనే..ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసన చేపట్టామన్నారు. ఆదివారం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో నిరసనలు నిర్వహించి వచ్చే ఆదివారం విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి, ఆపై ఆదివారం సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పంలో వినూత్న నిరసనలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి, పురూహూతికా అమ్మవారి సన్నిధిలో పొర్లు దండాలు పెట్టి, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి దేవుడా! ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి, మా బాధలు వినేలా చేయి అంటూ తమ గోడును విన్నవించుకున్నారు. -
కాంట్రాక్ట్..ఇక పర్మినెంట్
-
నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్
సాక్షి, హైదరాబాద్: నయా మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ నజర్ పెట్టింది. పంచాయతీలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో సర్పంచ్, పాలకమండలితోపాటు కార్యదర్శులుగా వ్యవహరించినవారు ఇచ్చిన ‘అనుమతుల’తో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల దుండిగల్‌లో నకిలీ అనుమతితో సాగిన నిర్మాణం వెలుగులోకి రావడంతో పురపాలక శాఖ అప్రమత్తమైంది. ఇటీవల ఏర్పాటైన 68 కొత్త మునిసిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన 131 గ్రామ పంచాయతీల్లో 2018 తర్వాత పాత తేదీల అనుమతితో వెలిసిన వెంచర్లు, నిర్మించిన భవనాలు, ఇళ్లు, తదితర కట్టడాల వివరాలను తెప్పించింది. ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లపై కోర్టుల్లో వివాదాలున్న నేపథ్యంలో కొత్త విధానం ద్వారా అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేలా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం కష్టంగా మారడంతో న్యాయ పరమైన చిక్కులు రాకుండా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. కొత్త మున్సిపాలిటీల్లోనే ఈ కొత్తవిధానం వర్తించేలా రూపొందించాలని యోచి స్తున్నట్లు సమాచారం. ఏ సర్వే నంబర్లో ఏ స్థలానికి ఎప్పుడు అనుమతి మంజూరైంది? నిర్మాణం సాగిన వివరాలను కూడా ఇన్‌వార్డు, అవుట్వార్డుల్లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ శివార్లు, ఇతర పట్టణాల సమీపంలో... గ్రేటర్ హైదరాబాద్ శివార్లన్నీ గతంలో గ్రామపంచాయతీలే. శివార్లలో గత 20 ఏళ్ల నుంచి వేల సంఖ్యలో లేఅవుట్లు వెలసి కాలనీలు ఏర్పాటయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016 నుంచి మళ్లీ శివారు పంచాయతీల్లో కొత్త వెంచర్లు, నిర్మాణాలు వచ్చాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన శివారు ప్రాంతాల్లోనూ పాత తేదీల ‘అనుమతి పత్రాల’తో కొత్త లేఅవుట్లు వెలిశాయి. దీంతో ఐటీ కారిడార్ పరిధిలోని కిస్మత్పూర్, పీరంచెరువు, బైరాగిగూడ, కోకాపేట, గోపన్‌పల్లి, మణికొండ, పుప్పాల్‌గూడ, నార్సింగి, మంచిరేవుల, బండ్లగూడ, దుండిగల్, పోచారం ప్రాంతాలతో పాటు ఓఆర్ఆర్కు లోపలున్న స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ పాత లేఅవుట్ల ఆధారంగా అనుమతిపత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు జరిగి నట్లు, ఇంకా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, పిర్జాదిగూడ, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పే ట, జిల్లెలగూడ, జవహర్‌నగర్ కార్పొరేషన్లతో పాటు ఇబ్రహీంపట్నం, జల్పల్లి, కోకాపేట, పోచారం, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, శంషాబాద్, ఆదిబట్ల, నాగారం, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, కరీంనగర్లో కొత్తపల్లి, మహబూబ్‌నగర్‌లో భూత్పూరు మొదలైన మున్సిపాలిటీల్లో ఒక ఫ్లోర్ అనుమతితో రెండు మూడంతస్తుల భవనాలను నిర్మించి నట్లు, పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం లే అవుట్లో వదిలేసిన స్థలాలు కూడా ఆక్రమణలకు గురై భవనాలు వెలిసినట్లు పురపాలక శాఖ గుర్తించింది. -
పార్ట్–టైమ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోరడం కుదరదు
న్యూఢిల్లీ: పార్ట్–టైమ్ ఉద్యోగులు మంజూరైన పోస్టుల్లో పని చేయడం లేదని, వారు క్రమబద్ధీకరణ(రెగ్యులరైజేషన్) కోరడం కుదరని సుప్రీంకోర్టు గురువారం తేల్చిచెప్పింది. ప్రభుత్వాలు ప్రకటించే రెగ్యులరైజేషన్ పాలసీకి అనుగుణంగానే క్రమబద్ధీకరణ చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. ఎవరూ క్రమబద్ధీకరణను తమ హక్కుగా భావించకూడదని స్పష్టం చేసింది. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం పార్ట్–టైమ్ ఉద్యోగుల విషయంలో వర్తించదని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో పార్ట్–టైమ్, తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నవారు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని కోరడం సమంజసం కాదని సూచించింది. పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఆర్డర్‌ను సవరిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేసింది. నిర్దిష్టమైన రెగ్యులరైజేషన్ పాలసీ రూపొందించాలని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విభాగాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టు ఆదేశించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించడం కేవలం ప్రభుత్వం బాధ్యత అని, దాంతో కోర్టుకు సంబంధం లేదని తెలియజేసింది. -
కోచ్‌ల ఆందోళన.. ‘క్రీడాబంధు’ కావాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: లాల్ బహదూర్ స్టేడియం వద్ద కోచ్‌లు మంగళవారం ఆందోళన చేపట్టారు. 28 ఏళ్ల నుంచి కాంట్రాక్డ్ పద్ధతిలో పని చేస్తున్న తమను క్రమబద్ధీకరరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కోచ్‌లు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ అమలు జీఓకి విరుద్ధంగా క్రీడా శాఖా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 29వ తేదీ వరకు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేశారు. దళిత బంధు మాదిరి తమకు కూడా క్రీడా బంధు ప్రవేశపెట్డాలని కోరారు. తెలంగాణ నుంచి క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్‌ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడా శాఖపై కనీస అవగాహన లేదు విమర్శించారు. శాట్స్ చైర్మన్, క్రీడా శాఖ మంత్రి ఫొటోలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తమ క్రమబద్ధీకరణపై హై కోర్ట్ అదేశాలను బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమకు జీతాలు అరకొర ఉన్నాయని, నెలాఖరుకు ముష్టి వేస్తున్నట్లు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీగా ఉన్న 500 కోచ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
‘ఉర్దూ’ కోర్సుపై ఊగిసలాట
సాక్షి, వైఎస్సార్ కడప : రాయలసీమ ప్రాంతానికి నడిబొడ్డుగా ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో 2017–18 విద్యాసంవత్సరంలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగా ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి దీనికి బాటలు వేయగా అప్పటి వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి కోర్సును ప్రారంభించారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఉర్దూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్లవుతున్నా ఇంకా సెల్ఫ్‌సపోర్టింగ్ కోర్సుగానే పరిగణిస్తూ వస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఆర్థికభారంతో పాటు పరిశోధనలకు అవకాశం లేకుండా పోతోంది. కోర్సును రెగ్యులరైజ్ చేసి పరిశోధనలకు అవకాశం కల్పించాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. తొలి సమావేశంలోనే తీర్మానం.. వైవీయూ తొలి మహిళా వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య మునగాల సూర్యకళావతి ఉర్దూ కోర్సును రెగ్యులరైజ్ చేసే అంశాన్ని 2020 ఫిబ్రవరి 25న నిర్వహించిన తొలి పాలకమండలి సమావేశంలోనే ఆమోదింపచేశారు. సెల్ఫ్ సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేస్తున్నట్లు జూన్ 23వ తేదీన రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. ఈ ఏడాది నోటిఫికేషన్లో సైతం ఉర్దూను సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుగానే పరిగణించారు. కాగా ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్ చేయడంతో పాటు కోర్సుకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేయాలని వైవీయూ అధికారులు ఉన్నతవిద్య అధికారులకు ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు చెందిన మైనార్టీశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్‌బాషా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. పరిశోధనలకు గండి వైవీయూలో గతంలో కొన్ని కోర్సులను పాలకమండలిలో ఆమోదించి రెగ్యులర్ కోర్సుగా మార్పుచేశారు. ఇప్పుడు అలాగే చేయాలని ఉర్దూ భాషాభిమానులు కోరుతున్నారు. వైవీయూ అధికారులు మాత్రం గతానికి, ఇప్పటికి నిబంధనలల్లో చాలా మార్పులు వచ్చాయని, కోర్సును రెగ్యులర్ చేయాలంటే రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది అవసరమని పేర్కొంటున్నారు. కాగా వైవీయూలో ఉర్దూ రెగ్యులర్ అధ్యాపకులు లేనప్పటికీ రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉర్దూ విభాగంలో ఉన్నారు. వీరికి ఉర్దూ పరిశోధకులకు గైడ్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ అవకాశం కల్పించకపోవడంతో పరిశోధన అవకాశాలకు కూడా గండిపడినట్లయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. వైవీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును సెల్ఫ్‌సపోర్టింగ్ నుంచి రెగ్యులర్ కోర్సుగా మార్పు చేసేందుకు తొలి పాలకమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నాం. కోర్సు నిర్వహణకు అవసరమైన రెగ్యులర్ అధ్యాపకులు, సిబ్బంది మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఆమోదం వచ్చిన వెంటనే ఉరర్దూను రెగ్యులర్ కోర్సుగా మార్పుచేస్తాం. – ఆచార్య మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, వైవీయూ -
అగమ్యగోచరంగా విద్యావలంటీర్ల పరిస్థితి
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తు న్న విద్యావలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నూతనంగా విధుల్లో చేరుతున్న ఉపాధ్యాయుల రాకతో వీవీలకు సంకటంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వీవీల పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది. ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోకి రెగ్యులర్ ఉపాధ్యాయులు వస్తున్నారు. దీంతో ఇప్పటివరకు పని చేసిన వీవీలు వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడిచిపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చేరే పరిస్థితి కూడా లేదు. దీంతో అయోమయంలో వీవీలు పడ్డారు సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో 144 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారుగా 30వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యా బోధనకై గతేడాది 780మంది వీవీలను తీసుకున్నారు. మెదక్ జిల్లాలో 89మంది ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 89మంది విధుల్లో చేరారు. అయితే వీరి స్థానంలో పని చేస్తున్న వీవీలను ఇంటికి పంపనున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా విద్యా వలంటీర్లను నియమించారు. మరో వైపు టీఆర్టీ అభ్యర్థులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్తులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం వెంటనే టీఆర్టీ నియామకాలను చేపట్టింది. ఆ స్థానంలో ఉన్న విద్యా వలంటీర్లను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నో ఆశలతో విధుల్లో చేరిన విద్యా వలంటర్లను తొలగించడం అనివార్యం కావడంతో వీవీలు అయోమయంలో పడ్డారు. ప్రైవేటులోనూ కష్టమే.. టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వటంలో ఆలస్యం అవుతుందని గతేడాది విధులు నిర్వహించిన వీవీలను విధుల్లోకి తీసుకోవాలని పాఠశాలల పునఃప్రారంభానికి ముందే వారు ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ ఎడాది పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యా వలంటీర్లను విధుల్లోకి చేర్చుకున్నారు. పాఠశాలల ప్రారంభంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యా వలంటీర్లంతా చురుగ్గా పాల్గొని గ్రామాల్లోని విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించారు. అంతా బాగానే ఉందని సంతోషంతో వీవీలు విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేయడంతో వీరి తొలగింపు అనివార్యమైంది. దీంతో వీవీలు ఆందోళన చెందుతున్నారు. విధుల్లో చేరి నెల కాకముందే తప్పుకోవాల్సి వస్తుండడంతో వారంతా ఆందోళనలో పడ్డారు. ఇటు ప్రైవేటు పాఠశాలల్లోను చేరే అవకాశం లేక పోవడంతో ఏం చేసేది అని చింతిస్తున్నారు. ఈ విషయమై డీఈఓ రవికాంత్రావ్ను వివరణ కొరగా వీవీలను తొలగిస్తామని సమాధానమిచ్చారు. యథావిధిగా కొనసాగించాలి మధ్యలో మమ్మల్ని తొలగిస్తే మేం ఏం కావాలి. వీవీ నమ్ముకొని ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నాం. రెగ్యూలర్ ఉపాధ్యాయులు రాగానే మమ్మల్ని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఈ ఏడాది కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేసి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధిని కోల్పోతాం. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతది. – నర్సింలు, వీవీల సంఘం మండల అధ్యక్షుడు, టేక్మాల్ యథావిధిగా కొనసాగించాలి మధ్యలో మమ్మల్ని తొలగిస్తే మేం ఏం కావాలి. వీవీ నమ్ముకొని ప్రైవేటు ఉద్యోగాలు వదులుకున్నాం. రెగ్యూలర్ ఉపాధ్యాయులు రాగానే మమ్మల్ని తొలగించడం సరైన పద్ధతి కాదు. ఈ ఏడాది కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వేరే ప్రాంతాల్లో సర్దుబాటు చేసి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉపాధిని కోల్పోతాం. కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా మారుతది. – నర్సింలు, వీవీల సంఘం మండల అధ్యక్షుడు, టేక్మాల్ -
వృత్తి విద్యాబోధకులను క్రమబద్ధీకరించాలి
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్‌సెంటర్) : ఏపీ సర్వశిక్ష అభియాన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేయుచున్న ఆర్ట్, వర్క్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరాముల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరై మాట్లాడుతూ వృత్తి విద్యాబోధకులకు అండగా ఉంటామన్నారు. చేస్తున్న ఉద్యమాలకు తప్పక సహకరిస్తామన్నారు. ప్రభుత్వానికి వృత్తి విద్యా బోధకుల సమస్యలను తీసుకువెళతామన్నారు. వీర్ల శ్రీరాములు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలీచాలనీ వేతనాలతో తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వం బేషరతుగా 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి.చినబాబు, భాస్కరరావు, సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతకుమారి, సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
జాబ్ పర్మినెంట్ చేయాలంటూ మహిళ..
సాక్షి, భోపాల్: గత కొంతకాలం నుంచి తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలంటూ గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు. కనీసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తమ సమస్యలను వినడం లేదంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లు వాపోతున్నారు. రాజధాని భోపాల్‌లో వందలాది గెస్ట్ లెక్చరర్లు సమావేశమై తమ డిమాండ్ల సాధన కోసం చర్చించారు. ప్రభుత్వంలో కదలిక వచ్చేవరకూ ఆందోళనను విరమించేది లేదని, తమ పోరాటాన్ని మరింత ఉధృత చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ మహిళా గెస్ట్ లెక్చరర్ గుండు కొట్టించుకుని (శిరోముండనంతో) నిరసన తెలిపారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేస్తున్నా, ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని మా మహిళా లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం శివరాజ్ సింగ్ ఇప్పటికైనా తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గం చూపించాలని కోరారు. -
లైన్ క్లియర్!
ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదలకు ఊరట లభించనుంది. భూమిలేని బీపీఎల్ కుటుంబాలకు ఈ భూములను అనుభవించే హక్కు దక్కనుంది. అయితే, ఇలా భూ బదలాయింపు జరిగిన పేదలకు భూమిపై యాజమాన్య హక్కు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేతులు మారిన భూములపై కొనుగోలుదారులకు అనుభవించే హక్కులు ఇవ్వడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దారిద్య్రరేఖ దిగువ ఉన్న పేదలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. సాగు చేసుకొని జీవనం సాగించేందుకు ఈ భూములను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ భూముల క్రయ విక్రయాలు నిషేధం. ఎవరైనా భూమి అమ్మినట్లు తేలితే.. పీఓటీ చట్టం– 1977 ప్రకారం ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలా తిరిగి తీసుకున్నదానిని మరో భూమిలేని పేదకు పంపిణీ చేసే విచక్షణాధికారం కూడా ఉంది. ధరలు నింగినంటడంతో.. భూముల విలువలు గణనీయంగా పెరగడంతో అసైన్మెంట్ భూములకు రెక్కలొచ్చాయి. చాలా చోట్ల ఇవి పక్కదారి పట్టాయి. బడాబాబులు, ప్రజాప్రతినిధులు కారుచౌకగా ఈ భూములను కొల్లగొట్టారు. రికార్డుల్లో అసైన్డ్‌దారుల పేర్లే కొనసాగుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరాధీనమయ్యాయి. వీటిలో చాలావరకు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండగా.. కొంతమంది మాత్రం ఫామ్‌హౌస్, రిసార్టులుగా మార్చారు. మరికొందరు ఏకంగా ఈ భూముల్లో బహుళ అంతస్తు భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఇంజనీరింగ్ తదితర విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. పలుకుబడి గల వ్యక్తుల గుప్పిట్లో ఉన్న భూములను వెనక్కి తీసుకోవడం రెవెన్యూయంత్రాంగానికి తలకుమించిన భారంగా మారింది. దీంతో అటువైపు కన్నెత్తి చూసేందుకే సాహసించడం లేదు. 77వేల ఎకరాలు అన్యాక్రాంతం జిల్లాలో ఇప్పటివరకు 87,064.35 ఎకరాలను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో 77,179.22(88.65%) ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు అధికార యంత్రాంగం లెక్కతేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి విక్రయించిన 3,705.02 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భూముల స్వాధీనాన్ని తప్పుబడుతూ 4,135 కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం ప్రహసనంగా మారింది. జిల్లావ్యాప్తంగా 25,697 మంది ఈ భూముల్లో పాగా వేసినట్లు ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. క్రమబద్ధీకరణ ఇలా..! ప్రభుత్వ తాజా నిర్ణయం ఈ భూములు కొనుగోలు చేసిన పేదలకు ఊరట లభించనుంది. భూమిలేని బీపీఎల్ కుటుంబాలకు ఈ భూములను అనుభవించే హక్కు దక్కనుంది. గతంలో భూములు కొనుగోలు చేసినా.. అమ్మినా చట్ట విరుద్ధం. కొన్ని చోట్ల మాత్రం భూమిలేని పేదలు కొంటే వారికే కేటాయించేవారు. అయితే, ఇదంతా స్థానిక అధికారుల విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది. ఈ క్రమంలో తాజా నిర్ణయంతో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన భూమిలేని పేదలకు ప్రయోజనం కలుగనుంది. అయితే, ఇలా భూ బదలాయింపు జరిగిన పేదలకు భూమిపై యాజమాన్య హక్కు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇదిలావుండగా, హెచ్ఎండీఏ పరిధిలో పరాధీనమైన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మన జిల్లా సింహభాగం హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్నందున.. ఈ ప్రయోజనం మారుమూల మండలాలకే వర్తించే అవకాశాలున్నట్లు తెలుస్తోందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాజాగా జరుగుతున్న రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళనలో భాగంగా.. చేతులు మారిన భూములపై స్పష్టత వచ్చిందని, అలాగే అందులో భూమిలేని పేదల జాబితాను కూడా సేకరించామని, దీని ఆధారంగానే వీటి బదలాయింపు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో పంపిణీ చేసిన అసైన్డ్ భూమి(ఎకరాల్లో) అసైన్డ్ చేసిన భూమి లబ్ధిదారుల ఆధీనంలో పరాధీనం 87,064.35 9,885.13 77,179.22 -
క్రమబద్ధీకరణకు ఓకే..
విద్యుత్ బోర్డుల ఆమోదం ప్రతిపాదనలు సీఎంకు..నేడు ఉత్తర్వులు! 20,903 మంది ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు ఇక రెగ్యులర్ హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనలను విద్యుత్ సంస్థల బోర్డులు ఆమోదించాయి. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్)ల బోర్డులు శుక్రవారం విద్యుత్‌సౌధలో సమావేశమయ్యాయి. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీ డీసీఎల్‌లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో4,333 మందిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఆ వెంటనే ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించాయి. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించిన మరుక్షణమే విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ ఉద్యోగులుగా విలీనం చేసుకుంటూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. మొత్తం 23,667 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 20,903 మంది అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు నిర్ధారించాయి. తెలంగాణ స్థానికత కాకపోవడం, వయో పరిమితి మీరిపోవడం, ఉద్యోగాన్ని మధ్యలో మానేయడం, సరైన సమాచారం లేకుండా దరఖాస్తు చేసుకోవడం తదితర కారణాలతో మిగిలిన వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 20,903 మంది ఉద్యోగుల్లో నైపుణ్యం లేని ఉద్యోగులు 3,199 మంది, స్వల్ప నైపుణ్యం గల ఉద్యోగులు 2,476 మంది, నైపుణ్యం గల ఉద్యోగులు 13,864 మంది, ఉన్నత నైపుణ్యం గల ఉద్యోగులు 1,364 మంది ఉన్నారు. -
21,000 మంది విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
నేడు విద్యుత్ బోర్డుల నిర్ణయం.. ఆ వెంటనే ఉత్తర్వుల జారీ! సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 21 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త. వారిని క్రమబద్ధీకరిస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నేడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్‌కో, విద్యుదుత్పత్తి సంస్థ జెన్కో, దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు(టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్) శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను ఆమోదించనున్నాయి. ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతుండటంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విలీనం (అబ్జార్ప్షన్) పేరిట ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. క్రమబద్ధీకరణను బోర్డులు ఆమోదిస్తే, ఆ మేరకు శనివారమే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విధివిధానాలు, మార్గదర్శకాలను విద్యుత్ సంస్థల బోర్డులు మే 29న సమావేశమై ఆమోదించాయి. నాలుగు విద్యుత్ సంస్థల్లో 23,667 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 21 వేల మందికి పైగా అర్హులని సిఫార్సు చేస్తూ అవి ఇటీవలే నివేదిక ఇచ్చాయి. ఏపీ విద్యుత్ సంస్థల్లో ప నిచేస్తున్న తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణలో క్రమబద్ధీకరణ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపైనా శుక్రవారం బోర్డులు నిర్ణయం తీసుకోనున్నాయి. 1000 ఏఈ పోస్టుల భర్తీపై కూడా ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో 1,000 మందికి పైగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ప్రకటన జారీ చేయడంపైనా విద్యుత్ సంస్థల బోర్డులు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నాయి. తర్వాత వారం రోజుల్లో నియామక నోటిఫికేషన్ రానుంది. విద్యుత్ సంస్థల్లో ఎన్నికలు వాయిదా వేయాలి కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ నేపథ్యంలో విద్యుత్ సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. అధ్యక్షుడు కేవీ జాన్సన్ నేతృత్వంలోని బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు వినతిపత్రం సమర్పించింది. కార్మికులందరిని క్రమబద్ధీకరించి వారికీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశమివ్వాలని కోరగా సీఎండీ అంగీకరించారని అనంతరం నేతలు తెలిపారు. క్రమబద్ధీకరణకు సహకరించిన ఎంపీ కవిత, ట్రాన్స్‌కో, డిస్కంల సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు. -
24 వేల మంది రెగ్యులరైజ్
విద్యుత్ శాఖ ‘ఔట్ సోర్సింగ్’పై కేసీఆర్ - ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు.. వద్దే వద్దు - మన పాలసీ ఒక్కటే.. చేతినిండా పని.. కడుపునిండా అన్నం - 15–20 రోజుల్లో పదోన్నతులు పూర్తి చేయాలి.. జూన్‌లో ప్రమోటెడ్ జీతం పొందాలి - 75 వేల మంది ఉద్యోగులతో దేశంలోనే పెద్ద కరెంట్ సంస్థగా నిలవబోతున్నాం - కరెంట్‌లాగా పనిచేయాలి.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘‘ఔట్ సోర్సింగ్ అంటే ఎట్లుండాలె. రెండు నెల్లకో మూడు నెల్లకో పని చేయించుకోవాలి. అంతేకానీ సంవత్సరాల తరబడి ఔట్సోర్సింగ్ ఏంది? కాంట్రాక్ట్ ఏంది? తలకాయ లేని ముచ్చట కాకపోతే.. గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడే చెప్పిన. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఉన్నట్టే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని, కాంట్రాక్ట్ మంత్రిని కూడా పెట్టరాదయ్యా అని! బెహతరీన్ మనుషులు దొరుకుతరని చెప్పిన. అందుకే ఇప్పుడా పద్ధతి అవసరం లేదని చెప్తున్నా..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘మనం పెట్టుకున్న పాలసీ ఒక్కటే. చేతినిండా పనిజెప్పాలె. కడుపునిండా అన్నం పెట్టాలె. ఈ ఔట్ సోర్సిం గ్, కాంట్రాక్టు, తోక తొండెం ఉండొద్దు. ఔట్ సోర్సింగాయన రెగ్యులర్ ఉద్యోగికన్నా ఎక్కువ పనిచేస్తాడు. భయానికో భక్తికో. అందుకే మన పాలసీ ఏందంటే.. ఎంతమంది అవసరమో అంతమందినే తీసుకో. అంతమందమే జీతం ఇవ్వు. ఆయనకు రావాల్సిన హక్కులన్నీ ఇవ్వు. పనిచేయించుకో. అదే మంచి పద్ధతి..’’అని అన్నారు. విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపడానికి ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీ లు జి.రఘుమారెడ్డి, గోపాలరావుల నేతృత్వంలో భారీ సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు గురువారం ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. వీరిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేద్దామంటే కోర్టుకు పోయారు. సరే.. పోతే పోయిందని జీతం తక్కువనో ఎక్కువనో అని చెప్పేసి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశాం. విద్యుత్ సంస్థలో ఉన్న కాజువల్ లేబర్‌కు కూడా న్యాయం చేయాలి. వాళ్లను పిలుచుకుని మాట్లాడండి’’అని సీఎం అధికారులకు సూచించారు. కరెంటులా పనిచేయాలి.. ‘‘ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల చైర్మన్లకు నాదొక్కటే మనవి. రాబోయే 15–20 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయండి. ప్రమోటైన ఉద్యోగి జూన్ నెల జీతం ప్రమోటెడ్ జీతంగా పొందాలి. కరెంటు ఎట్ల పనిచేస్తదో మీరట్ల పనిచేయాలి. అగో అంటే ఆర్నెల్లు కావొద్దు. నెల కాకుంటే రెండు నెలలు. అంతకంటే ఎక్కువ కావొద్దు. జూన్‌లో కాకుంటే జూలైలో ఇవ్వండి’’అని సీఎం విద్యుత్ సంస్థల సీఎండీలకు ఆదేశాలు జారీ చేశారు. పాత డీపీసీ పద్ధతి ఉంటే తీసి పడేయాలని, కొత్త పద్ధతితో ఇస్తున్నాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీ పోస్టులకు నియామక ప్రకటన జారీ చేసి భర్తీ చేయాలని సూచించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా త్వరగా రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. 75 వేల మంది ఉద్యోగులతో.. ‘‘రెండు వేల మందిని కొత్తగా నియమించుకున్నాం. ఇప్పుడు 13,500 మంది తీసుకుంటున్నాం. అంటే దాదాపు 16 వేల మంది అవుతున్నారు. 27 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నరు. మొత్తం 43 వేల మంది అవుతారు. ఇంకో 24 వేల మంది ఔట్ సోర్సింగ్ వాళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నాం. అంటే 75 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద కరెంటు సంస్థగా నిలవబోతున్నాం..’’అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో 3 లక్షల మంది ఉద్యోగులుంటే.. ఆ తర్వాత అంత స్థాయిలో ఉద్యోగులున్నది విద్యుత్ సంస్థే అని పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆర్టీసీ, సింగరేణి ఉంటాయన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి తప్ప అందరికీ 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. రైతులకు కూడా 24 గంటల కరెంటు ఇవ్వాలని తాను అడిగితే కచ్చితంగా ఇస్తామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అన్నారని పేర్కొన్నారు. అయితే 2012 నుంచి ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీఎండీ కోరారన్నారు. 13,500 ఉద్యోగాలు భర్తీ చేసుకుంటామని, దీంతో 10 వేల మందికి ప్రమోషన్లు కూడా వస్తాయని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేస్తామని తెలిపినట్లు వివరించారు. దానికి తాను సరేనన్నానని సీఎం చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి ‘‘అందరూ కష్టపడి పనిచేయాలి. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి. దయచేసి ఆ అవతారం ఎత్తాలే. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలి. మీరు చేస్తరనే విశ్వాసం నాకుంది’’అని ముఖ్యమంత్రి అన్నారు. అంధకారం అవుతుందన్న తెలంగాణ బ్రహ్మాండమైన రాష్ట్రంగా తయారుకావడానికి లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, ఇంజనీర్లే కారణమన్నారు. లైఫ్ రిస్క్ తీసుకుని వారు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఎత్తిపోతల భారం డిస్కంలపై పడదు.. ‘‘2018 జూన్ తర్వాత దాదాపు 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తీసుకుంటం. అంటే ఉచితంగా కాదు. హరీశ్‌రావు ఇప్పట్నుంచే లెక్కలు చూసుకోవాలి. లిఫ్ట్ ఇరిగేషన్ కరెంటు చార్జీల భారం రూపాయి కూడా విద్యుత్ సంస్థలపై పడదు. ఇరిగేషన్ డిపార్టుమెంటే బడ్జెట్లో కేటాయిస్తుంది’’అని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు, కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి తదితర ప్రాజెక్టులకు వచ్చే ఏడాది చివర నుంచి విద్యుత్ అవసరముంటుందని, దీనికి సిద్ధం కావాలని సూచించారు. ఓపెన్ యాక్సెస్ రద్దు చేస్తాం... ఓపెన్ యాక్సెస్ విధానంలో పారిశ్రామికవేత్తలు కొంత విద్యుత్ బయట్నుంచి కొంటున్నారని, త్వరతో దీన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లే పరిశ్రమలకు సర్‌చార్జి విధిస్తామని, రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దీంతో విద్యుత్ సంస్థలు మనుగడ సాధిస్తాయన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ తేలేనా?
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌లలో వేలల్లో ఖాళీ పోస్టులు - కాంట్రాక్టు క్రమబద్ధీకరణ కుదరదన్న హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరేనా? - కాంట్రాక్టు పోస్టుల్లో 5,027 మంది లెక్చరర్లు - అయినా మరో 2350 పోస్టులు ఖాళీయే - కాంట్రాక్టు అంశం తేలకున్నా భర్తీకి వీలుగా 2,650 పోస్టులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు కొట్టివేయడమే కాకుండా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ కుదరదని స్పష్టం చేయడంతో ప్రభుత్వం గందరగోళంలో పడింది. డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తే కాంట్రాక్టు అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తామని, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెబుతోంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం చేకూరదేమోనన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లోనూ ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, వివరణలతో కూడిన మార్గదర్శకాల ప్రకారమే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కుదరదని హైకోర్టు స్పష్టం చేయడమే అందుకు కారణం. రెగ్యులరైజేషన్ ఎలా చేయాలనుకున్నారంటే.. రాష్ట్ర విభజన, ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసేందుకు ప్రొహిబిషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అపాయింట్మెంట్స్ (యాక్టు 2/1994) చట్టాన్ని సవరించింది. ఇందుకు అనుగుణంగా 2016 ఫిబ్రవరి 26న జీవో 16 తెచ్చింది. 2014 జూన్ 2 నాటికి ముందు నుంచీ పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలేజీలవారీగా పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు హైకోర్టులో పిల్ దాఖలు చేయగా కాంట్రాక్టు క్రమబద్ధీకరణ విషయంలో స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రమబద్ధీకరణ కుదరదంటూ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లినా రెగ్యులరైజేషన్ అనేది సాగదీతే తప్ప సాధ్యం కాదని అధికారులే పేర్కొంటున్నారు. మిగిలిన పోస్టులను భర్తీ చేయొచ్చు కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారం ఇప్పట్లో తేలకపోయినా ప్రభుత్వం తలచు కుంటే ఇప్పటికిప్పుడు 2,650 పోస్టులను భర్తీ చేసే వీలుంది. కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని 5,027 పోస్టులు కాకుండా మిగిలిన ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అ«ధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. ఇదీ కాలేజీలవారీగా పరిస్థితి... - జూనియర్ లెక్చరర్ పోస్టులు మొత్తం 5,905 ఉండగా అందులో 900 పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగిలిన 5,005 ఖాళీల్లో 3,638 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తుండగా మరో 1,367 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. - డిగ్రీ కాలేజీల్లో మొత్తం 2700 పోస్టులు ఉన్నాయి. అందులో 1,600 మంది రెగ్యులర్ అధ్యాపకులు పని చేస్తున్నారు. మరో 924 పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కాంట్రాక్టు అధ్యాపకుల్లో 117 మందికే నిర్ణీత అర్హతలు ఉండగా మిగిలిన 807 పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 176 పోస్టులను కలుపుకొని 983 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయవచ్చు. - పాలిటెక్నిక్ కాలేజీల్లో 465 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉంటే మంజూరైన ఖాళీలు 165 మాత్రమే ఉన్నాయి. అయితే కాలేజీల్లో అవసరాల మేరకు పోస్టులు లేకపోయినా కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టి కొనసాగిస్తున్నారు. మిగతా 300 పోస్టులను సృష్టించి భర్తీ చేయాల్సి ఉంది. -
ఎలాపడితే అలా క్రమబద్ధీకరణ కుదరదు
-
ఎలాపడితే అలా క్రమబద్ధీకరణ కుదరదు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఎలా పడితే అలా క్రమబద్ధీకరించడానికి వీల్లేదని, ఈ విషయంలో కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 1996, అంతకు ముందు నియమితులై, పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పదిహేనేళ్లుగా వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరించే ముందు వారి అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు క్రమబద్ధీకరణ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ నిర్ణయం మేరకు క్రమబద్ధీకరణ చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకం ఏకపక్షంగా జరగడం లేదని, పత్రికల్లో ప్రకటనలు జారీ చేసి, అర్హతల ఆధారంగానే ఆయా శాఖలు నియామకాలు చేస్తున్నాయని తెలిపారు. ఇదే అంశంపై గతంలో వ్యాజ్యం దాఖలైందని, అందులో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, కాబట్టి ఆ వ్యాజ్యంతో ఈ వ్యాజ్యాన్ని జత చేసి, కౌంటర్ దాఖలుకు గడువునివ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని అన్వయించుకున్న ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం ఈ చట్టంలోని సెక్షన్ 10ఏను చేర్చిందన్నారు. క్రమబద్ధీకరణ విషయంలోనే కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ సెక్షన్ విరుద్ధమన్నారు. గతంలో దాఖలైన వ్యాజ్యంలో ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించబోమంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం, దానిని ఉల్లంఘించి తాజాగా జీవో 16ను జారీ చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిర్దిష్ట విధానం ద్వారా కాకుండా ఇతర పద్ధతుల్లో నియామకాలు పొందిన వారి సర్వీసులను ఇలా క్రమబద్ధీకరించుకుంటూ పోతుంటే, ఇక నిరుద్యోగులు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల వారు ఎప్పటికీ నిరుద్యోగులుగానే ఉండిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమాదేవి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, దాని ప్రకారం 1996, అంతకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమితులై, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి సేవలను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
క్రమబద్ధీకరణ సరికాదు
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ మానుకోవాలని హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత విధానం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ సరికాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఇక ఇప్పటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీ సులను క్రమబద్ధీకరించడం మానుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోరడంతో, అందుకు అంగీకరిస్తూ విచా రణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనా థన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్ర వరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇలా క్రమబద్ధీ కరించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధ మని పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. -
రెగ్యులరైజ్ చేయలేం
-
‘క్రమబద్ధీకరణ’కు భారీగా దరఖాస్తులు
► రెవెన్యూ శాఖకు అందిన ఆరు వేల దరఖాస్తులు ► చివరి రోజున ఆధార్ కార్డు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: పట్టణ భూపరిమితి(యూఎల్సీ) చట్టం కింద ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. యూఎల్సీ భూములున్న ప్రాంతాల నుంచి దరఖాస్తు సమర్పణకు చివరి గడువు (శనివారం) నాటికి సుమారు ఆరు వేల దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 5,600 దరఖాస్తులు రాగా, హైదరాబాద్ జిల్లాలో 300, వరంగల్ జిల్లా నుంచి సుమారు వంద దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. యూఎల్సీ ఖాళీస్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని గత నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పలు జీవోల ద్వారా యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ/ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వుల మేరకు మండల తహసీల్దార్ స్థాయిలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసే వెసులుబాటును కల్పించింది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కృషి ఫలితంగా యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ క్రమేపీ ఊపందుకుంది. అయితే.. ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు ఈ నెల 25తో దరఖాస్తు గడువు ముగిసింది. మరో వారం రోజులు గడువు పొడిగించిన పక్షంలో మరో రెండు వేల దరఖాస్తులు వచ్చే అవ కాశం ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఒకసారి డిక్లరెంట్ నుంచి కొనుగోలు చేసిన స్థలాలకు తిరిగి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం పట్ల స్థలాల యజమానులు తొలుత భారంగా భావించినా, సదరు ఆస్థిపై హక్కులు వస్తాయి కదాని చివరి వారంలో దరఖాస్తు చేసేందుకు మొగ్గుచూపారని చెబుతున్నారు. హైదరాబాద్ శివారుల్లో ఈ తరహా భూములు కొన్న కొందరు ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార రీత్యా పొరుగు రాష్ట్రాల్లో ఉండడం, మరికొందరు ఇతర దేశాల్లో ఉన్నందున క్రమబద్ధీకరణ సమాచారం అందకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు.. యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో తొలి నుంచి ఆధార్ నంబరును భూపరిపాలన విభాగం అధికారులు తప్పనిసరి చేయడంతో ఆధార్ కార్డులేని వారు దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఖాళీస్థలాలు కొనుగోలు చేసిన వారిలో స్థానికంగా ఉండేవారితో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న పలువురికి ఆధార్ కార్డులు లేకపోవడంతో వారంతా దరఖాస్తులు సమర్పించలేకపోయారు. ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా రావడం, మీ సేవా కేంద్రాల్లో వాటిని తిరస్కరించడంపై సీసీఎల్ఏ అధికారులు ఆలస్యంగా స్పందించారు. దరఖాస్తు సమర్పణకు ఆఖరు రోజున మాత్రమే ఆధార్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ సమాచారం ఎక్కువమందికి చేరలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వారం రోజులు గడువిస్తే, పూర్తిస్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఒక వేళ దరఖాస్తు స్వీకరించని పక్షంలో సదరు స్థలాల యజమానుల నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా స్థలాలను స్వాధీన పరచుకోలేని పరిస్థితి ఉన్నందున గడువు పెంచడమే మేలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు పెంపుతో పాటు.. క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన ధరను ఇంకాస్త తగ్గించినట్లయితే ఎక్కువమందికి మేలు చేకూరుతుంద ని, ప్రస్తుత ధర కాకుండా సదరు స్థలాలను కొనుగోలు చేసిన తేదీనాటి బేసిక్ విలువలను పరిగణనలోకి తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు. -
హైదరాబాద్‌ను సర్వనాశనం చేస్తున్నారు: హైకోర్టు
హైదరాబాద్ : అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ విషయంలో తెలంగాణ సర్కార్ వైఖరిని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఎప్పటికప్పుడు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ పథకాలను తీసుకురావడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారంటూ హైకోర్టు మండిపడింది. అసలు అక్రమంగా నిర్మించిన వాటిని ఎలా క్రమబద్దీకరిస్తారని నిలదీసింది. క్రమబద్దీకరణకు అనుసరిస్తున్న విధి విధానాలు ఏమిటని ప్రశ్నించింది. ఈ పథకం ముసుగులో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా బిల్డర్లు, యజమానులు చేసే నిర్మాణాలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అసలు ఏ నిర్మాణాలను క్రమబద్దీకరించాలనుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ చట్టానికి కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అన్ని రకాల అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు ఎప్పటికిప్పుడు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ పథకాలను పొడిగిస్తూ వస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెట్ బ్యాక్‌లు లేని, ఎత్తు విషయంలో నిబంధనలు పాటించని నిర్మాణాలను, అగ్నిమాపక నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన వాటిని ఇలా ప్రతీ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరిస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ ఆర్డినెన్స్‌ను సవాలు చేశారని, అయితే ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు లేదని, అది ఇప్పుడు చట్ట రూపం దాల్చబోతోందన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించిందని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇటువంటి పథకాల ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడింది. అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు ఎటువంటి విధి విధానాలను అనుసరిస్తున్నారని, ఎటువంటి నిర్మాణాలను క్రమబద్దీకరించాలని నిర్ణయించారో చెప్పాలంది. దీనికి ఏజీ స్పందిస్తూ, బీపీఎస్ పథకంలోని నిబంధనలను చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, అనుమతించిన ప్లాన్ లేకుండానే నిర్మాణాలు చేపడితే వాటిని క్రమబద్దీకరించడానికి వీల్లేదని ఈ నిబంధనల్లో ఉన్నట్లు గుర్తించింది. దీనికి శివరాజు స్పందిస్తూ, లే అవుట్‌కు అనుమతి ఉండాలని, అనుమతి లేని లేఔట్లలో చేసిన నిర్మాణాలను సైతం ప్రభుత్వం క్రమబద్దీకరిస్తోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించడానికి వీల్లేదని, అందుకు తాము ఏ విధంగానూ అనుమతించబోమని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తెచ్చారని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దానిని సవాలు చేయాలని, అందుకు సంబంధించి సవరణలతో అనుబంధ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. మరోవైపు అసలు ఎటువంటి నిర్మాణాలను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు.. అందుకు అనుసరించనున్న విధి విధానాలను తమ ముందుంచాలని ఏజీకి స్పష్టం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లకు గడువు పెంపు
ఎన్నికల కమిషన్ అనుమతితో మార్చి 1 వరకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు క్రమబద్ధీకరణ పథకాల గడువు నెల రోజులు పెంపు ఇప్పటివరకు 2,20,849 ఎల్ఆర్ఎస్, 1,68,519 బీఆర్ఎస్ దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ పథకాల గడువును రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1వ తేదీ వరకు పొడిగించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో... రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతితో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను తొలుత 60 రోజుల గడువుతో గత నవంబర్ 2న అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ గడువు డిసెంబర్ 31తో ముగియడంతో.. నెల రోజులు గడువు పెంచారు. ఈ పెంపు గడువు కూడా గత నెల 31తోనే ముగియగా తిరిగి మరో నెల రోజులు పొడిగించారు. ఇప్పటిదాకా రూ.309 కోట్ల ఆదాయం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు ఫిబ్రవరి 1వ తేదీ నాటికి చెల్లించిన సొమ్ము రూ.309.77 కోట్లకు చేరింది. ఫిబ్రవరి 1 నాటికి మొత్తంగా 2,20,849 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, 1,68,519 బీఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి రూ.175.90 కోట్లు, బీఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి రూ.133.87 కోట్ల ఆదాయం ఖజానాకు జమ అయింది. నిబంధనల మేరకు ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ దరఖాస్తుతో పాటు కనీసం 50 శాతం క్రమబద్ధీకరణ చార్జీలనుగానీ లేదా రూ.10 వేలు గానీ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే అధిక శాతం దరఖాస్తుదారులు రూ.10 వేలు మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తే ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం రూ. వెయ్యి కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షకు మించిన ‘గ్రేటర్’ దరఖాస్తులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తుల సంఖ్య లక్షను దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,10,489 బీఆర్ఎస్, 54,933 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా... హెచ్ఎండీఏ పరిధిలో 92,681 ఎల్ఆర్ఎస్, 29,562 బీఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు పథకాలు కలిపి ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి రూ.126.12 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.96.22 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక రాష్ట్రంలోని ఇతర పురపాలికల విషయాన్ని పరిశీలిస్తే.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో 19,092 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలో 54,143 ఎల్ఆర్ఎస్, 28,468 బీఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. కుడాకు రూ.1.96 కోట్లు, డీటీసీపీకు రూ.85.46 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య, ఆదాయం (రూ.కోట్లలో) దరఖాస్తులు ఆదాయం ఎల్ఆర్ఎస్ 2,20,849 175.90 బీఆర్ఎస్ 1,68,519 133.87 మొత్తం 3,89,368 309.77 -
ఇదేం మెలిక..!
* ఇళ్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి * ఫీజు చెల్లించాల్సిందే అంటున్న అధికారులు * లబోదిబోమంటున్న ఇళ్ల యజమానులు * హెచ్ఎండీఏ తీరుపై నిరసనల వెల్లువ సాక్షి, హైదరాబాద్: నిబంధనలను అతిక్రమించి నిర్మించుకున్న భవనాలను బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకునేందుకు వెళ్లిన ఇంటి యజమానులకు హెచ్ఎండీఏలో చుక్కెదురవుతోంది. మొదట లేఅవుట్ రెగ్యులైరె జేషన్(ఎల్ఆర్ఎస్) చేసుకుంటేనే... ఆ తర్వాత బీఆర్ఎస్ కింద ఇంటిని క్రమబద్ధీకరిస్తామంటూ అధికారులు మెలిక పెడుతున్నారు. ఎప్పుడో... 25 ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్‌కు ఇప్పుడు ఫీజు చెల్లించమనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తే... తామేమీ చేయలేమంటూ ప్రభుత్వ జీఓను చూపిస్తున్నారు. దీంతో షాక్‌కు గురైన లబ్ధిదారులు చేసేదేమీలేక తిరుగుముఖం పడుతున్నాడు. బీఆర్ఎస్ కింద ఇంటి క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికి.. లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజునూ జత చేస్తుండటంతో అంతమొత్తాన్ని చెల్లించలేక చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. దీంతో హెచ్ఎండీఏ ఖజానాకు రావాల్సిన డబ్బు కూడా రాకుండా పోతోంది. ఖాళీ స్థలం లేదంటూ... కాలనీలో పార్కులు, ఆట స్థలాల కోసం ఖాళీ స్థలాలు వదల్లేదంటూ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. ఓపెన్ స్పేస్ వదిలి ఉంటే ఆ మేరకు ఇప్పుడు మీకు ఫీజులో మినహాయింపు ఇచ్చేవారమంటున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లకు గ్రామ పంచాయతీలే అనుమతులిచ్చాయి. ఖాళీ స్థలాల గురించి అప్పట్లో వారు పెద్దగా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రోడ్లకు స్థలం వదిలారా? లేదా? అన్నది చూసి అనుమతులిచ్చేశారు. ఇలాంటి కాలనీల్లో గ్రామపంచాయతీకి ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా చిన్నచిన్న మార్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నవారు, అనుమతి లేకుండా పెంట్ హౌస్ కట్టుకున్నవారు ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, మణికొండ, ప్రగతినగర్ గ్రామ పంచాయతీల పరిధిలో కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లలో ఫ్లాట్లు విక్రయించేటప్పుడే ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బు వసూలు చేసి ఆ మొత్తాన్ని కట్టకుండానే కాజేశారు. మరికొందరు డెవలపర్స్ లేఅవుట్లో రోడ్లు, పార్కు, గ్రౌండ్స్ కోసం స్థలం వదిలినట్లు చూపి ఆ తర్వాత వాటిని కూడా ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. ఇలా డెవలపర్ చేసిన పొరపాట్లు ఇప్పుడు ఇంటి యజమానులకు శాపంగా మారాయి. ఇలాంటి ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు ససేమిరా అంటుండటంతో పలువురు నెత్తీనోరు బాదుకుంటున్నారు. రెగ్యులరైజేషన్ పేరుతో మళ్లీ లక్షల రూపాయలు చెల్లించమని హెచ్ఎండీఏ నోటీసులు పంపుతుండడం శివారు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 50 లక్షలకు.. వచ్చింది 20 వేల దరఖాస్తులే...? క్రమబద్ధీకరణ కోసం అసలు దరఖాస్తు చేసుకోని వారిని వదిలేసి, ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొచ్చిన వారికి సవాలక్ష ఆంక్షలు విధిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ కింద మొత్తం 50 లక్షలకు పైగా దరఖాస్తులు రావాల్సి ఉండగా, క్రమబద్ధీకరణ కోరుతూ ఇప్పటివరకు 20 వేల దరఖాస్తులు మాత్రమే వ చ్చాయి. క్రమబద్ధీకరణ గడువు ముగిశాక అక్రమ నిర్మాణాలు, లే అవుట్ల కూల్చివేతకు చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నా... శివారు ప్రాంత ప్రజలు ఖాతరు చేయడం లేదు. అపార్టుమెంట్లలో రెగ్యులరైజ్ చేసుకోని వారికి ఆస్తిపన్ను రూ.2 వేల స్థానంలో రూ.10 వేలు విధించి కొన్నేళ్లపాటు వసూలు చేస్తామని, నీళ్లు, విద్యుత్, డ్రైనేజి కనెక్షన్ తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
క్రమబద్ధీకరించాల్సిందే..
ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నామని, తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని జవహర్‌నగర్‌వాసులు శనివారం భారీ ఆందోళన చేపట్టారు. బస్తీవాసులంతా కలిసి పీడీఎం (దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం) ఆధ్వర్యంలో డ్వాక్రా భవన కార్యాలయాన్ని ముట్టడించారు. రెవెన్యూ అధికారులను నిలదీశారు. 20 సంవత్సరాలుగా ఇంటిపన్నులు చెల్లిస్తున్నామని, ఎందుకు క్రమబద్ధీకరించరని మండిపడ్డారు. - జవహర్‌నగర్ జవహర్‌నగర్: ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న అందరి స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జవహర్‌నగర్‌వాసులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బస్తీవాసులంతా కలిసి పీడీఎం (దేశభక్త ప్రజాతంత్ర ఉద్య మం) ఆధ్వర్యంలో డ్వాక్రా భవన కార్యాల యాన్ని ముట్టడించారు. తమ ఇళ్లను కూడా క్రమబద్ధీకరించాలని రెవెన్యూ అధికారులను నిలదీశారు. ఏ లెక్కన గ్రామకంఠం పరిధిలోని భూములను క్రమబద్ధీకరిస్తున్నారో తెలియజేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కంఠంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించాల్సిన అవసరం లేదని, 20 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తూ ఇంటిపన్నులు చెల్లిస్తున్నామన్నారు. జీవో నం.58 ప్రకారం 125 గజాలలోపు నివసించే పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం చెబుతుండగా అధికారులు గ్రామ కంఠం లో ఉన్న భూముల ధరఖాస్తులు వూత్రమే తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా 30వేల ఇళ్లను పట్టించుకోవడంలేదని వుండిపడ్డారు. క్రమబద్ధీకరణ జీవో వస్తే తవు కష్టాలు తీరుతాయని ఆశపడ్డావుని తవు ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ.. పేద ప్రజలందరి ఇళ్లను క్రమబద్ధీకరించే వరకూ ఉద్యమాలను ఆపేదిలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. -
అనధికార కాలనీలకు మంచిరోజులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీముందువరకూ వెలిసిన నగరంలోని 895 అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి శుభవార్త. వీటి క్రమబద్ధీకరణకోసం ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది. ఇందువల్ల ఈ కాలనీల్లో నివసిస్తున్న దాదాపు 60 లక్షల మంది ప్రజలకు లబ్ధి కలగనుంది. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీకి ముందువరకూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాల్లో సవరణలకోసం ఉద్దేశించి రూపొందించిన ఆర్డినెన్స్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీ మార్చి, 31, 2002 కాగా తాజా ఆర్డినెన్స్ కారణంగా ఈ గడువు జూన్, 1, 2014 అయింది. ఈ బిల్లు వల్ల ఈ ఏడాది మార్చి 31వ తేదీనుంచి జూన్ ఒకటో తేదీలోగా వెలిసిన అనధికార కాలనీలు కూడా క్రమబద్ధీకరణకు నోచుకుంటాయి. మంత్రి మండలి సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఆర్డినెన్స్ సవరణ వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన 895 అనధికార కాలనీల్లో నివసిస్తున్న 60 లక్షల మంది లబ్ధి పొందుతారన్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు త్వరలోనే వెల్లడిస్తారన్నారు. ఒకసారి క్రమబద్ధీకరణ పూర్తయితే ఆయా కాలనీల్లో వసతులు మెరుగుపడతాయన్నారు. -
స్వామిగౌడ్ ను అడ్డుకున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను ఓయూజేఏసీ అడ్డుకుంది. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో జరిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల విద్యా సదస్సుకు మండలి చైర్మన్ స్వామిగౌడ్, కోదండరాం, దేవీప్రసాద్, విఠల్ లు హాజరయ్యారు. ఈ సమావేశానికి నేతలు హాజరవుతున్నారని తెలుసుకున్న ఓయూ విద్యార్ధులు గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు.