ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నామని, తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని జవహర్‌నగర్‌వాసులు శనివారం భారీ ఆందోళన చేపట్టారు.
ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నామని, తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని జవహర్‌నగర్‌వాసులు శనివారం భారీ ఆందోళన చేపట్టారు. బస్తీవాసులంతా కలిసి పీడీఎం (దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం) ఆధ్వర్యంలో డ్వాక్రా భవన కార్యాలయాన్ని ముట్టడించారు. రెవెన్యూ అధికారులను నిలదీశారు. 20 సంవత్సరాలుగా ఇంటిపన్నులు చెల్లిస్తున్నామని, ఎందుకు క్రమబద్ధీకరించరని మండిపడ్డారు. - జవహర్‌నగర్
జవహర్‌నగర్: ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న అందరి స్థలాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ జవహర్‌నగర్‌వాసులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బస్తీవాసులంతా కలిసి పీడీఎం (దేశభక్త ప్రజాతంత్ర ఉద్య మం) ఆధ్వర్యంలో డ్వాక్రా భవన కార్యాల యాన్ని ముట్టడించారు. తమ ఇళ్లను కూడా క్రమబద్ధీకరించాలని రెవెన్యూ అధికారులను నిలదీశారు. ఏ లెక్కన గ్రామకంఠం పరిధిలోని భూములను క్రమబద్ధీకరిస్తున్నారో తెలియజేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కంఠంలో ఉన్న భూములను క్రమబద్ధీకరించాల్సిన అవసరం లేదని, 20 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తూ ఇంటిపన్నులు చెల్లిస్తున్నామన్నారు.
జీవో నం.58 ప్రకారం 125 గజాలలోపు నివసించే పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం చెబుతుండగా అధికారులు గ్రామ కంఠం లో ఉన్న భూముల ధరఖాస్తులు వూత్రమే తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా 30వేల ఇళ్లను పట్టించుకోవడంలేదని వుండిపడ్డారు. క్రమబద్ధీకరణ జీవో వస్తే తవు కష్టాలు తీరుతాయని ఆశపడ్డావుని తవు ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ.. పేద ప్రజలందరి ఇళ్లను క్రమబద్ధీకరించే వరకూ ఉద్యమాలను ఆపేదిలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.