
సాక్షి, హైదరాబాద్: లాల్ బహదూర్ స్టేడియం వద్ద కోచ్‌లు మంగళవారం ఆందోళన చేపట్టారు. 28 ఏళ్ల నుంచి కాంట్రాక్డ్ పద్ధతిలో పని చేస్తున్న తమను క్రమబద్ధీకరరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కోచ్‌లు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ అమలు జీఓకి విరుద్ధంగా క్రీడా శాఖా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
సెప్టెంబర్ 29వ తేదీ వరకు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేశారు. దళిత బంధు మాదిరి తమకు కూడా క్రీడా బంధు ప్రవేశపెట్డాలని కోరారు. తెలంగాణ నుంచి క్రీడాకారులు తయారవ్వాలంటే కోచ్‌ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రీడా శాఖపై కనీస అవగాహన లేదు విమర్శించారు. శాట్స్ చైర్మన్, క్రీడా శాఖ మంత్రి ఫొటోలకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తమ క్రమబద్ధీకరణపై హై కోర్ట్ అదేశాలను బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమకు జీతాలు అరకొర ఉన్నాయని, నెలాఖరుకు ముష్టి వేస్తున్నట్లు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఖాళీగా ఉన్న 500 కోచ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.