‘మండలి’ సిబ్బంది బతుకమ్మ వేడుకలు | 'Council' staff celebrations Bathukamma | Sakshi
Sakshi News home page

‘మండలి’ సిబ్బంది బతుకమ్మ వేడుకలు

Published Wed, Oct 14 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

‘మండలి’ సిబ్బంది బతుకమ్మ వేడుకలు

‘మండలి’ సిబ్బంది బతుకమ్మ వేడుకలు

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో పూల వేడుకగా బతుకమ్మ ప్రసిద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం మండలి సచివాలయ సిబ్బంది అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా మహిళలతో కలసి ఆయన బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ఇలాంటి అవకాశం వలస పాలనలో రాలేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఆ స్వేచ్ఛ లభించిందని చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి రాజా సదారాం, డిప్యూటీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, టీఆర్‌ఎస్ నేత రాజేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement