పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అర్హులైన పేదలకు భూమి పట్టాలను అందించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కావగూడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని గ్రామంలోని పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గ్రామసర్పంచి, పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న కాముని చెరువును ఆయన సందర్శించారు. కాముని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులను ఎమ్మార్వో వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.