Land documents
-
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
రూ.కోటి విలువ చేసే స్థలం కొట్టేయాలని..
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి రూ.కోటి విలువ చేసే భూమిని కొట్టేయాలని పథకం రచించిన ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్‌తో కలిసి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ శనివారం వివరాలు వెల్లడించారు. ►బీబీనగర్‌లోని రాఘవాపూర్‌కు చెందిన దొంతి సత్తిరెడ్డి స్థానికంగా వ్యాపారి. కొన్నేళ్లుగా మాగ్జిమా రిసార్ట్స్ ఫామ్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 204, 221లోని 2,420 గజాల రెండు ప్లాట్లు ఖాళీగా ఉండటాన్ని గమనించాడు. యజమానుల రాకపోకలు లేకపోవటంతో దానిని స్వాహా చేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో నకిలీ పత్రాలతో ప్లాట్లను విక్రయించడంలో సిద్ధహస్తుడైన పాత నేరస్తుడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసరలోని చీర్యాలకు చెందిన దాడి ధర్మేందర్ రెడ్డిని సంప్రదించాడు. ►ఇద్దరు కలిసి సదరు భూమికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలను సంపాదించారు. అనంతరం ధర్మేందర్ రెడ్డి సూచన మేరకు ఉప్పర్‌పల్లికి చెందిన సయ్యద్ నజీర్ ఉర్ రహ్మాన్ (ప్రస్తుతం మరణించాడు) నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్లు, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించాడు. వీటి సహాయంతో భూమిని ఇతరులకు విక్రయించాలని భావించారు. ►ఇందుకోసం ముందుగా భూమిని జనరల్ పవరాఫ్ అటార్నీ (జీపీఏ) చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు ప్లాట్ల అసలు యజమానులైన కేబీ ఖురానా, అనిల్ ఖురానాల వయసుకు సరిపోయే లా వ్యక్తులను చూడాలని కోరుతూ బోరబండకు చెందిన మహ్మద్ షౌకాత్ అలీని సంప్రదించారు. ►దీంతో కేబీ ఖురానా లాగా యూసుఫ్‌గూడకు చెందిన గొర్రె రమేష్, అనిల్ ఖురానా లాగా వల్లపు రాములు నటించారు. ఆ పైన ప్లాట్లను బోరబండకు చెందిన చాకలి రాముకు జీపీఏ చేసినట్లు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు చేశారు. రసూల్‌పురకు చెందిన మహ్మద్ ఇబ్రహీం, యూసుఫ్‌గూడకు చెందిన వాలి బాలకృష్ణ సాక్షి సంతకాలు చేశారు. ఈ డాక్యుమెంట్ల సహాయంతో సత్తిరెడ్డి, ధర్మేంద్రరెడ్డి ఆయా ప్లాట్లను రూ.65 లక్షలకు విక్రయించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీ కూపీ లాగడంతో ముఠా లింకు బయటపడింది. ఇప్పటివరకు ఈ ముఠా 12 నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ప్లాట్లను విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ఇబ్రహీం, బాలకృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.7 లక్షల నగదు, 9 నకిలీ డాక్యుమెంట్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
‘గోల్డెన్’డీల్.. ఒక్క డాక్యుమెంట్ రూ.15.96 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ‘గోల్డెన్’డీల్స్ వస్తున్నాయి. 2023 సంవత్సరం ప్రారంభంలోనే మంచి బోణీ అందింది. జనవరి తొలివారంలో ఒకే ఒక్క డాక్యుమెంట్ రిజి స్ట్రేషన్‌తో ఏకంగా రూ.15.96 కోట్ల ఆదాయం సమకూరింది. గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో ఉన్న 75,072 చదరపు గజాల భూమిని మైనార్టీ ట్రస్టు నుంచి మరో ఎడ్యుకేషనల్ ట్రస్టుకు బదలాయిస్తూ (కన్వేయన్స్) ఈ లావాదేవీ జరిగింది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ భూమి మొత్తం మార్కెట్ విలువను రూ.210 కోట్లుగా లెక్కించి, రూ.15.96 కోట్ల ఫీజు వసూలు చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ ఆరేడు జాక్‌పాట్ లావాదేవీలు జరిగినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తాజాగా తెలిసింది. ఇంతకు ముందు ఇంకా పెద్ద డీల్ 2022 మేలో ఒకే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఏకంగా రూ.35.51 కోట్ల ఆదాయం సమకూరింది. కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వచ్చే మిస్కిపేటలో 1,54,880 చదరపు గజాల భూమిని ఓ ఆయిల్ కార్పొరేషన్, ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కలిసి మరో రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాయి. ఈ భూమి మార్కెట్ విలువ రూ.466 కోట్లుగా నిర్ధారించిన రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు 35.51 కోట్ల ఫీజు వసూలు చేశారు. ఇక గండిపేట, రాజేంద్రనగర్, వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ పలు భారీ లావాదేవీలు జరిగాయని.. కేవలం 5 డాక్యుమెంట్ల ద్వారానే రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ సమకూరిందని అధికారవర్గాలు తెలిపాయి. రూ.14,500 కోట్లదాకా ఆదాయం! రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఫిబ్రవరి 13 నాటికి రూ.12,310 కోట్ల వరకు ఖజానాకు చేరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో.. ఇంకో రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల్లో పేర్కొన్న విధంగా రూ.16 వేల కోట్లు, 2023–24కు నిర్దేశించుకున్న రూ.18 వేల కోట్లు సమకూరే అవకాశం లేదని.. రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా భూ విలువలను సవరిస్తేనే లక్ష్యం చేరుకోవడం సాధ్యమని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూము లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ కలిపి రూ.14,500 కోట్ల మేరకు సమకూరవచ్చని అంటున్నారు. -
16 గ్రామాల్లో రీ సర్వే పూర్తి.. రైతులకు పత్రాల పంపిణీ!
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంలో భాగంగా భూముల రీ సర్వేను మూడు ఫేజ్‌ల్లో చేపట్టగా ఫేజ్ 1లో 98 గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. అందులో పైలెట్ ప్రాజెక్టుగా 16 మండలాల్లోని 16 గ్రామాల్లో రీ సర్వే పనులు పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో ఉండే వ్యవసాయ, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ను రీ సర్వే చేసి నూతన రికార్డుల్లో పొందుపరిచారు. సర్వే పూర్తి చేసిన గ్రామాలకు సంబంధించి రైతులకు జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి 23న ప్రారంభించారు. అందులో భాగంగా జిల్లాలో సర్వేపూర్తి చేసిన 16 గ్రామాలల్లో కూడా భూ పత్రాల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పత్రాల్ని అందిస్తారు. 16 గ్రామాలకు కలిపి మొత్తం 6,187 మంది రైతుల 5,656 పత్రాలు పంపిణీ చేస్తారు. 98 ఏళ్ల తర్వాత రీ సర్వే 98 ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ పాలకులు భూముల సర్వే చేసి వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములుగా విభజించి వాటిని రికార్డుల్లో ఎక్కించారు. అప్పటి నుంచి భూముల రీ సర్వే చేయలేదు. ఏళ్ల తరబడి ఉన్న రికార్డులు పాడువడం, భూముల మాయం, కచ్చితమై విస్తీర్ణం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి భూముల రీ సర్వే కోసం ప్రత్యేకమైన పథకం ప్రవేశపెట్టి ఉచితంగా రీ సర్వే చేయిస్తున్నారు. భూముల సర్వే చేయించి కొలతల ప్రకారం భూమి చుట్టూ సర్వే రాళ్లు వేయిస్తున్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో వెంటనే భూ హక్కు, రక్షణ పత్రాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అధునిక పరికరాలతో రీ సర్వే భూముల రీ సర్వే కోసం అధికారులు అధునిక పరికరాలను ఉపయోగించి సర్వే పనులు చేస్తున్నారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్, ఇతర సిబ్బంది కలిసి ఒక టీంగా ఏర్పడి సర్వే చేసి వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. భూముల రీసర్వే పనులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ల్యాండ్ అండ్ సర్వే శాఖ జిల్లా అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న సర్వే పనులు ఎప్పటికప్పుడు పరిశీలిన చేసి సర్వేపై సూచనలు, సలహాలు ఇస్తు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం గ్రామాల్లోని వ్యవసాయ, గ్రామ కంఠం, ప్రైవేట్ భూములను ఉచితంగా రీ సర్వే చేసి, కచ్చితమైన విస్తరణతో భూములను చూపించి వాటికి సంబంధించి భూహక్కు, రక్షణ పత్రాలను అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూముల రీ సర్వే ద్వారా భూ సమస్యలు, గొడవలకు చెక్ పెట్టేలా సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 16 గ్రామాల రైతులకు పత్రాల పంపిణీ రీసర్వేకు సంబంధించి ఫేజ్ 1లో 98 గ్రామాల్లో పనులు చేపట్టాం. పైలెట్ ప్రాజెక్టుగా 16 గ్రామాల్లో పూర్తి చేశాం. ఈ గ్రామాలకు సంబంధించి 6,187 రైతులకు 5,656 జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టాం. భూహక్కు రక్షణ పత్రాలు అందుకున్న రైతులు వాటిలో తప్పులుంటే మండలంలో మొబైల్ మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకుంటే సమస్య పరిష్కరిస్తాం. మిగిలిన గ్రామాల్లో సర్వే పనులు వేగంగా చేయించి మూడు ఫేజ్‌ల్లో భూముల రీ సర్వే పనులు పూర్తి చేస్తాం. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్ -
ముగ్గురు కిలేడీలు.. పక్కా ప్లాన్ వేసి బతికున్న వారిని..
ఉప్పల్(హైదరాబాద్): బతికున్న వారిని చనిపోయినట్లు డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రూ. రెండు కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్‌రెడ్డి, బాదితులు శుక్రవారం తెలిపిన మేరకు.. కొత్తపేట రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన పచ్చిపులుసు వరలక్ష్మి(71) రామంతాపూర్‌లో 1983లో 267 గజాల స్థలం కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా 2021 డిసెంబర్లో ఈశానమ్మ తదితరులు స్థలం తమదంటూ వరలక్ష్మిని బలవంతంగా బయటకు పంపారు. వరలక్ష్మికి ఏకైక కూతురు తనే అంటూ జ్యోతి అనే మహిళ నకిలీ సర్టిఫికెట్లతో వచ్చి.. వరలక్ష్మి 2014 ఆగస్టు నెలలోనే మృతి చెందిందంటూ తన కూతురు పాసల వెన్నెల పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసింది. ఆ తరువాత పాసల వెన్నెల(19) గొల్లపూడి మరియమ్మకు రిజిస్ట్రేషన్ చేసింది. ఆ తరువాత స్థలం జ్యోతికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో బాధితురాలు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం పసుల జ్యోతి(33), జ్యోతి కూతురు వెన్నెల(19), చిలుకానగర్ ప్రాంతానికి చెందిన బల్ల జ్యోతి(27)లను నింధితులుగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. వీరికి సహాకరించిన ఎనశమ్మ, శ్రవణ్, మల్లికార్జున్, రాయన్నలపై కూడ పోలీసులు కేసు నమోదు చేసారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
రెవెన్యూ భూములు గందరగోళం
జిల్లా రెవెన్యూ రికార్డులు గందరగోళంగా తయారయ్యాయి. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమి ఉన్నట్లు ఇష్టారీతిన రికార్డులను మార్చివేశారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు తారుమారయ్యాయి. దీంతో జిల్లాలో రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి కంటే దాదాపు 49,352.16 ఎకరాల భూమిని అధికంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. రికార్డుల్లో లేని ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. సాక్షి, కందుకూరు(ప్రకాశం) : జిల్లాలో భూముల లెక్కలకు మదర్ రికార్డు అయిన ఆర్ఎస్ఆర్ రికార్డుకు, ఆన్లైన్లో నమోదు చేసిన భూములకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. జిల్లాలోని 56 మండలాల్లో ఇదే పరిస్థితి. ఒక్క మండలానికి సంబంధించిన రికార్డు కూడా సక్రమంగా లేదు. కొన్ని మండలాల్లో భూములు అధికంగా ఉంటే మరికొన్ని మండలాల్లో రికార్డు కంటే భూములు తక్కువగా ఉన్నాయి. దీంతో రికార్డు ప్రక్షాళన కార్యక్రమానికి కలెక్టర్ పోల భాస్కర్ లింగసముద్రం మండలం నుంచి శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే. ► ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం ఉండాల్సిన భూమి: 32,90,765.40 ఎకరాలు ► వెబ్‌ల్యాండ్‌లో నమోదు నమోదు చేసిన భూమి: 33,40,117.56 ఎకరాలు ఆర్ఎస్ఆర్ ప్రకారం 32,90,765.40 లక్షల ఎకరాల భూమి: ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం జిల్లాలో అన్ని రకాల భూములు కలుపుకుని 32,90,765.40 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ ప్రకారం 33,40,117.56 లక్షల ఎకరాలున్నాయి. వెబ్‌ల్యాండ్ ప్రకారం జిల్లాలో ప్రభుత్వ భూమి 11,99,686.63 లక్షల ఎకరాలు, ప్రైవేట్ భూమి 20,91,689.45 లక్షల ఎకరాలున్నాయి. అలాగే ఇనామ్ భూములు 25,886.61 ఎకరాలు, 22854.22 ఎకరాల ఇతర భూములున్నాయి. మొత్తం మీద ఆర్ఎస్ఆర్ రికార్డుకి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన భూములకు మధ్య తేడా 49,352.16 ఎకరాలు అధికంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో లేని భూమిని ఉన్నట్లు చూపించారు. 40 మండలాల రికార్డుల్లో భూములు అధికంగా నమోదు కాగా, మిగిలిన 16 మండలాల రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువగా వెబ్‌ల్యాండ్‌లో నమోదైంది. ఆర్ఎస్ఆర్ రికార్డు కంటే అధికంగా భూమి నమోదైన మండలాల జాబితాలో మర్రిపూడి మండలం మొదటి స్థానంలో ఉంది. 33,315.33 ఎకరాల భూమి అధికంగా నమోదైంది. తరువాత స్థానంలో దర్శి 25225.58 ఎకరాలు, కొనకనమిట్ల 24716.61 ఎకరాలు అధికంగా నమోదు చేశారు. ఇక భూములు తక్కువగా నమోదు చేసిన మండలాల్లో కురిచేడు మండలం మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో వెబ్‌ల్యాండ్ ప్రకారం .. మొత్తం భూములు 730002.89 ఎకరాలు ఉంటే, ఆర్ఎస్ఆర్ ప్రకారం 1,45,650.43 ఎకరాల భూములున్నాయి. అంటే దాదాపు 72,647.54 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అంటే ఇక్కడ ఆన్లైన్ సమస్యలు అధికంగా ఉన్నాయని అర్థమవుతోంది. తరువాత స్థానంలో బేస్తవారిపేట మండలంలో 41,225.16 ఎకరాలు, హనుమంతునిపాడు 18,365.64 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అలాగే ఆర్ఎస్ఆర్ రికార్డుకు, వెబ్‌ల్యాండ్‌కు దాదాపుగా సమానంగా ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. వీటిలో సంతనూతలపాడు 0.48 సెంట్లు, కొరిశపాడు 6.94 ఎకరాలు తక్కువగా ఉంటే, సింగరాయకొండ 26.52 ఎకరాల భూములు అధికంగా ఉన్నాయి. ఈ మూడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల రికార్డులు భారీ స్థాయిలో మార్ఫింగ్‌కు గురయ్యాయి. వందల ఎకరాల భూముల వివరాలు తారుమారయ్యాయి. లింగసముద్రంతో ప్రక్షాళన ప్రారంభం: ప్రభుత్వ రెవెన్యూ రికార్డు ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కలెక్టర్ పోల భాస్కర్ ప్రత్యేక శ్రద్ధతో కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూముల రీ సర్వే ప్రారంభించారు. దాదాపు 70 మంది రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకు లోన్లు పొందిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తమ బండారం బయటపడుతుండడంతో కొందరు అక్రమార్కులు ఏకంగా తహసీల్దార్‌నే చంపుతామని బెదిరింపులకు దిగడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం సర్వే మాత్రమే అధికారులు అక్కడ పూర్తి చేయగలిగారు. అక్రమాలైతే వెలుగులోకి వస్తున్నాయి గానీ వాటిపై చర్యలు ఎంత వరకు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటారా లేదా బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిపై చర్యలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ రికార్డులను మార్పుచేయడం అంత సులభరమైన ప్రక్రియేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందిదే కీలక పాత్ర: ఇలా రికార్డులు తారుమారు కావడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులతే కీలక పాత్ర అని తెలుస్తోంది. ప్రధానంగా ఆన్లైన్ ప్రక్రియను అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్ప డుతున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. కొందరు రైతులకు ఉన్న భూమి కంటే ఆన్లైన్లో అధికంగా నమోదు చేయడం, అడంగల్, 1బి వంటి రికార్డులను మార్చడం, పాస్‌పుస్తకాల్లో అధికంగా భూములు నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీని వల్లే రికార్డుల కంటే అధికంగా భూములు నమోదవుతున్నాయి. ఇలా బ్యాంకుల్లో రుణాలు పొందడం ఇంకా మోసం. ఇలా కొంత కాలంగా రెవెన్యూ అధికారుల లీలలకు అడ్డూఅదుపు లేకుండా పోవడంతో రికార్డులు మొత్తం గందరగోళంగా తయారయ్యాయి. దీంతో భూ సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో 90 శాతం భూములకు సంబంధించిన సమస్యలే ఉండడం గమనార్హం. సంవత్సరాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే రికార్డులు సక్రమంగా లేకపోవడమే. ప్రస్తుతం ప్రభుత్వం ఈ రికార్డులను సరిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి. -
పోగొట్టుకున్న భూమి పత్రాల అప్పగింత
విజయనగరం టౌన్ : పట్టణంలోని కానుకుర్తివారివీధికి చెందిన శర్మ పని నిమిత్తం ఇంటి నుంచి తన 17 ఎకరాలకు చెందిన భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో అవి ఎక్కడో పడిపోయాయి. విషయాన్ని సాయంత్రం నాలుగు గంటల సమయంలో గమనించి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఉన్న బీట్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు రాత్రి 7 గంటల ప్రాంతంలో మయూరీ జంక్షన్ బీట్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు డాక్యుమెంట్లను గుర్తించి పోలీసులకు అందజేశారు. ట్రాఫిక్ ఎస్సై వాసుదేవ్ వెంటనే విషయాన్ని బాధితుడిని రప్పించి డాక్యుమెంట్లు అందజేశారు. -
సిమ్‌కార్డుల గుట్టు తేలేనా?
* నయీమ్ డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న 700 సిమ్‌కార్డులపై దర్యాప్తు షురూ * టెలికం కంపెనీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసు దర్యాప్తు వేగం అందుకుంది. ఇన్నాళ్లు భూ డాక్యుమెంట్లు, ఇళ్లపై దృష్టిపెట్టిన పోలీసులు ఇప్పుడు సాంకేతిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. పుప్పాలగూడ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితో పాటు వంట మనిషి ఫర్హా నా పేరిట తిరుమల గార్డెన్లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్, అంజలీ గార్డెన్లో ఉన్న మరో ఇంటి నుంచి లభించిన మొత్తం 700 సిమ్‌కార్డులపై విచారణను వేగవంతం చేశారు. ఆయా నెట్‌వర్క్‌ల సిమ్‌కార్డులతో ప్రత్యేక పోలీసు బృందం ఆయా కంపెనీలకు వెళ్లింది. ఆ సిమ్‌కార్డులన్నీ ఎవరి పేరిట ఇచ్చారు? చిరునామాలేంటి? అన్న వివరాలతోపాటు కాల్ డేటా జాబితాను సేకరిస్తున్నారు. తప్పుడు చిరునామాలతో.. : చాలా సిమ్‌కార్డులను తప్పుడు చిరునామాలతో తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. కొన్ని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవారి ఆధార్ కార్డులు సమర్పించినట్టు గుర్తించారు. సిమ్‌కార్డులపై పూర్తిస్థాయి దర్యాప్తుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. అలాగే కొన్ని కాల్‌డేటా వివరాలను డాక్యుమెంటేషన్ రూపంలో రెడీ చేస్తున్నారు. వారిద్దరికీ మరో ఆరు రోజుల కస్టడీ.. అల్కాపురి కాలనీలోని నయీమ్ ఇంట్లో పట్టుబడ్డ ఫర్హానా, అఫ్సాలను 12 రోజుల పోలీసు కస్టడీ ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి న్యాయస్థానం మంగళవారం విచారించింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని, మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వాదించారు. అయితే న్యాయమూర్తి 6 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బుధవారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి వారిద్దరిని కస్టడీలోకి తీసుకోనున్నారు. వీరిని రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలోని నయీం ఆస్తులను గుర్తించేందుకు తీసుకువెళ్లనున్నారు. సమీరుద్దీన్ కస్టడీకి పిటిషన్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన నయీమ్ డ్రైవర్ సమీరుద్దీన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హయత్‌నగర్ న్యాయస్థానంలో మంగళవారం పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. నల్లగొండకు చెందిన మహ్మద్ రియాజుద్దీన్ కుమారుడు మహ్మద్ సమీరుద్దీన్ ఏడాది క్రితం నుంచే నయీమ్, అతని అల్లుడైన ఫహీంల వద్ద పని చేసేవాడు. సమీరుద్దీన్‌ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. -
సర్కారు వెబ్సైట్లో డాక్యుమెంట్లు ఢమాల్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌ను స్తంభింపజేసిన అధికారులు * ఐజీఆర్ఎస్లో కనిపించని భూములు, స్థలాల డాక్యుమెంట్లు * ‘రాజధాని దురాక్రమణ’పై ‘సాక్షి’ కథనంతో కలకలం * డాక్యుమెంట్లు బయటకు ఎలా వచ్చాయంటూ * అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం * ఇకపై ఒక్కటీ బయటకు రాకూడద ని ఆదేశం * బినామీల దందా, మోసాలు బయటపడతాయన్న ఆందోళన! సాక్షి, హైదరాబాద్ రాజధాని దురాక్రమణపై ‘సాక్షి’ ప్రచురించిన ససాక్ష్య కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లో, అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. ‘అసలు డాక్యుమెంట్లు ఎలా బయటకు వచ్చాయి..? ఇకపై ఒక్క డాక్యుమెంటు కూడా బయటకు రావడానికి వీలులేదు...’ అంటూ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుక్షణమే ప్రభుత్వ వెబ్సైట్లో డాక్యుమెంట్లు మాయమైపోయాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్సైట్ ఐజీఆర్ఎస్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కన్పించకుండా పోయాయి. ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి వెళ్లి డాక్యుమెంటు నంబర్ ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత భూమి/ స్థలం అమ్మకం దస్తావేజు నకలు (సర్టిఫైడ్ కాపీ) చూసుకునే వెసులుబాటు చాలాకాలంగా ఉంది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ వెబ్సైట్లో డాక్యుమెంట్లు కనిపించకుండా చేయడం గమనార్హం. దస్తావేజుల నకళ్లు కనిపిస్తే సర్కారు పెద్దల బినామీ కొనుగోళ్లు, మరిన్ని మోసాలు బయటపడతాయనే భయంతోనే అవి కనిపించకుండా వెబ్‌సైట్‌ను స్తంభింపజేసినట్లు స్పష్టమవుతోంది. అధికారులపై బాబు చిందులు: రాజధాని అమరావతి ప్రాంతంలో 25,000 ఎకరాల భూములను ప్రభుత్వ పెద్దలు అప్పనంగా, కారుచౌకగా కొట్టేయడంపై ‘రాజధాని దురాక్రమణ’ శీర్షికతో బుధవారం ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. కంచే చేనును మేసిన చందంగా సీఎం చంద్రబాబు దర్శకత్వంలో ఆయన కుమారుడు లోకే శ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ బినామీలతో సాగించిన భూ మాఫియాపై పక్కా ఆధారాలతో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలతో ముఖ్యమంత్రికి నోట మాటరాలేదు. వాస్తవాలను ఖండించలేక, చేసిన మోసాలను ఒప్పుకోలేక ‘డాక్యుమెంట్లు ఎలా బయటకు వచ్చాయంటూ..’ బాబు అధికారులపై మండిపడ్డారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెబ్సైట్లో సర్టిఫైడ్ కాపీలు కనిపించకుండా బ్లాక్ చేశారు. సీఎం వైఖరి సరికాదంటున్న అధికారులు రాజధాని ప్రాంతంలో రాబందుల్లా భూములను దోచుకున్న విషయాన్ని ఖండించాల్సింది పోయి, డాక్యుమెంట్లు ఎలా బయటకు వచ్చాయంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని అధికార వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ‘భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను ఎవరైనా తీసుకోవచ్చు. అవేమీ రహస్యం కాదు. అలాంటప్పుడు అవి ఎలా బయటకు వచ్చాయని మమ్మల్ని అడగడంలో అర్థమే లేదు. మొన్నటికి మొన్న సాగునీటి ప్రాజెక్టుల ప్యాకేజీల అంచనా వ్యయం పెంచడం ద్వారా కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వాటాలు పంచుకున్న విషయాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేసినప్పుడు కూడా సమాచారం బయటకు ఎలా వెళ్లిందంటూ సీఎం మాపై చిందులేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చాలని సీఎం చెప్పడం ఏమిటి?’ అంటూ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదానికీ అధికారులను బలి చేయడం ముఖ్యమంత్రికి అలవాటై పోయిందని వాపోతున్నారు. -
పట్టాలు పంపిణీ చేసిన శాసనమండలి చైర్మన్
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అర్హులైన పేదలకు భూమి పట్టాలను అందించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కావగూడ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని గ్రామంలోని పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గ్రామసర్పంచి, పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న కాముని చెరువును ఆయన సందర్శించారు. కాముని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి అనువైన పరిస్థితులను ఎమ్మార్వో వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. -
రెవిన్యూ లీల.. ఎస్సీల గోల
♦ సాగుకు ఇరు వర్గాలకు భూ పట్టాలు! ♦ ఓ వర్గానికి భూమి చూపక పోవడంతో పదేళ్లుగా వివాదం ♦ కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల చెట్లను నరికిన ఓ వర్గం ♦ గతంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల దృష్టికి సమస్య ♦ తాజాగా చెట్ల నరికివేతపై ప్రస్తుత కలెక్టర్‌కూ ఫిర్యాదు ♦ సమస్యను పరిష్కరించడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం సాక్షి ప్రతినిధి, కడప : వారంతా ఎస్సీలు. కష్టాన్ని నమ్ముకొని జీవించే బడుగు జీవులు. ప్రభుత్వ సహాయ సహకారాలు పొందేందుకు అక్షరాల అర్హులు. అయితే రెవిన్యూ అధికారుల తప్పిదం కారణంగా దశాబ్దకాలంగా వారి మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చే రాయి. తక్షణమే స్పందించి పరిష్కరించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో చెట్లు నరికివేత సంృ్కతి వేళ్లూనుకుంటోంది. సమస్య జిల్లా కలెక్టర్ల దృష్టికి వెళ్లినా పరిష్కారం దొరకని వైనమిది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు జెడ్‌హెచ్‌డిసీ కాలనీకి చెందిన ఎస్సీలకు చంద్రమౌళి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్కరికి 2.85 ఎకరాల నుంచి 3.60 ఎకరాల చొప్పున అర్హులైన 107 మంది ఎస్సీలకు పట్టాలు అందించారు. 1993-94లో అప్పటి కలెక్టర్ కెవి రమణాచారి వారి భూముల్లో బోర్లు వేయించి నీటి సౌకర్యం కల్పించారు. అప్పటి వరకు మోడువారిన భూములు పచ్చదనం నింపుకున్నాయి. సజావుగా పంటలు సాగుచేసుకుంటున్న తరుణంలో 2005లో కమ్మపల్లెలో 25 మంది ఎస్సీలకు రెవిన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. అయితే భూమి హద్దులు చూపించలేదు. దీంతో అప్పటి నుంచి వారు జడ్‌హెచ్‌డీసీ భూములు తమవేనంటూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముగ్గురు కలెక్టర్లు మారినా తెగని వివాదం ఓబులవారిపల్లె ఎస్సీల మధ్య నెలకొన్న భూవివాదం అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న 827 ఎకరాల్లో సర్వే నిర్విహ ంచి, ఎవరెవరు ఏయే సర్వే నంబర్లలో భూములు కలిగి ఉన్నారనే వివరాలు అందజేయాలని అప్పటి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఆదేశించారు. సర్వే చేసేందుకు సమాయత్తమైన తరుణంలో ఆయన బదిలీ అయ్యారు. అనంతరం కలెక్టర్‌గా వచ్చిన అనిల్‌కుమార్ రికార్డులు పరిశీలించి ఆ భూములపై చిన్నఓరంపాడు ఎస్సీలకే హక్కు ఉందని నిర్ధారించారు. దీంతో తమ భూములు ఎక్కడ ఉన్నాయో చూపాలంటూ కమ్మపల్లె ఎస్సీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈలోగా ఎన్నికలు రావడం.. కలెక్టర్ అనిల్‌కుమార్ బదిలీ కావడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తర్వాత వచ్చిన కలెక్టర్ కోన శశిధర్ హయాం పూర్తి కాలం ఎన్నికలతో సరిపోయింది. మళ్లీ తెరపైకి వచ్చిన వివాదం కమ్మపల్లె ఎస్సీలు జడ్‌హెచ్‌డీసీ భూముల్లోకి వెళ్లి ఈ భూములు తమవే అంటూ ఎవరూ అడ్డువస్తారో రండి అంటూ ప్రత్యక్షదాడులకు సిద్ధమయ్యారు. ఆ భూముల్లోకి ప్రవేశించి సుమారు 75 నిమ్మచెట్లు నరికి వేశారు. ఈ ఘటనపై చిన్నఓరంపాడు ఎస్సీలు రాజంపేట ఆర్డీఓ, కలెక్టర్ కె.వి.రమణను కలిసి వారి సమస్యను విన్నవించారు. చెట్లు నరికిన వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అప్పట్లో రాజంపేట ఆర్డీఓ జోక్యం చేసుకుని.. ఇకపై కమ్మపల్లె ఎస్సీలు ఈ భూముల జోలికి రారని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని చెప్పి రాజీ కుదిర్చారు. అయితే ఈనెల 15న మరోమారు 630 (అరటి, మామిడి, సఫోట) చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికేశారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న చెట్లు ఒక్క పూటలో తెగిపడ్డాయని బాధితులు తహశీల్దారు నుంచి కలెక్టర్ వరకు, ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు విన్నవించుకున్నారు. పది రోజులైనా ఈ ఘటనపై విచారించిన పాపాన పోలేదని వారు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యను పూర్తిగా వినడం లేదని, బాధితులందరితో మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరే స్పందించకపోతే ఇక తమకు దిక్కెవరని కన్నీటిపర్యంతమవుతున్నారు. -
పట్టా ఉన్న వాడిదే భూమి