
సర్వేలో బీసీల విశ్వరూపం చూపాలి
శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్
హైదరాబాద్: కులం బలపడకుండా బీసీ వర్గం బలపడదని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రధమ మహాసభ జరిగింది. బీసీ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన స్వామిగౌడ్ మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్, సబ్‌ప్లాన్ అమలు జరగాలంటే ఈ నెల 19న జరిగే సర్వేను విజయవంతం చేయాలని కోరారు. సర్వేలో బీసీ కులాల విశ్వరూపం ఏమిటో చూపించాలన్నారు. అప్పుడే ప్రభుత్వాలకు మన బలమెంతో తెలుస్తుందని, హక్కులు సాధించుకోవడానికి వీలవుతుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు 87 శాతం ఉన్న అందరూ ఏకతాటిపైకి రాకపోవడానికి కారణం రాజకీయాలేనని అన్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీల్లో బలమైన నాయకుడైన ఆర్.కృష్ణయ్య సీఎం అయ్యేందుకు తాను కూడా ఓటు వేసి బలపరుస్తానని చెప్పారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి బండారు ప్రకాష్ , బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆచార్యులు, బీసీ సంక్షేమ