
గౌడ్స్ న్యూస్ వెబ్‌చానల్ ప్రారంభం
గౌడ కులస్తుల బతుకుచిత్రాన్ని యావత్తు జాతికి తెలియజేసేలా గౌడ్స్ న్యూస్ వెబ్‌సైట్ చానల్ పనిచేయాలని
హైదరాబాద్: గౌడ కులస్తుల బతుకుచిత్రాన్ని యావత్తు జాతికి తెలియజేసేలా గౌడ్స్ న్యూస్ వెబ్‌సైట్ చానల్ పనిచేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ముత్యం ముఖేశ్‌గౌడ్ సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గౌడ్స్ వెబ్‌చానల్‌ను స్వామిగౌడ్ తన చాంబర్‌లో సోమవారం గౌడ సంఘాల నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర గౌడ సమాచారాన్ని నిరంతరం అందించాలన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, గౌడ జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వైస్ చైర్మన్ అంబాల నారాయణగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధానకార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, గౌడ యువజన సంఘం అధ్యక్షుడు ముత్యం మనోహర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.