శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్
నెల్లికుదురు (మహబూబాబాద్): తెలం గాణ బహుజన విప్లవ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌తోపాటు ఎంతో మంది తెలంగాణ పోరాట యోధుల విగ్రహాల ప్రతిష్టాపనలో అప్పటి ప్రభుత్వాలు వివక్ష చూపాయని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మేచరాజుపల్లిలో గురు వారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహా న్ని స్వామిగౌడ్ ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధు ల విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. వారి స్ఫూర్తితో ఉద్యమిస్తారనుకుని వారి ఫొటో లు, విగ్రహాలను నాడు కనిపించని వ్వలేద న్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, రాష్ట్ర నాయకుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.