మండలి చైర్మన్ పదవికి స్వామిగౌడ్ నామినేషన్ | Swamy Goud files nomination for Telangana Council chairman post | Sakshi
Sakshi News home page

మండలి చైర్మన్ పదవికి స్వామిగౌడ్ నామినేషన్

Published Tue, Jul 1 2014 11:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మండలి చైర్మన్ పదవికి స్వామిగౌడ్ నామినేషన్ - Sakshi

మండలి చైర్మన్ పదవికి స్వామిగౌడ్ నామినేషన్

హైదరాబాద్ :   తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వామిగౌడ్ నామినేషన్కు ఎంఐఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నరసింహరావు, మంత్రులు హరీశ్‌రావు, కేటీ రామారావు, ఈటెల రాజేందర్, పద్మారావుతోపాటు టీఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్సీలు  హాజరు అయ్యారు.

 

బుధవారం నుంచి మండలి సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశంలో శాసనమండలి చైర్మన్ను ఎన్నుకోనున్నారు. మరోవైపు  చైర్మన్ అధ్యక్ష స్థానానికి కాంగ్రెస్ తరపున ఫారుఖ్ హుస్సేన్ నామినేషన్ వేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement