telangana council
-
తెలంగాణ మండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనచారి బాధ్యతల స్వీకరణ
-
ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని ఆయన బుధవారం శాసనమండలిలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ వెల్లడించారు. గ్రామాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కుల వృత్తులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇక తెలంగాణ ఐ పాస్‌ను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. విద్యుత్ శాఖలో 24 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగి అనేది లేకుండా చూస్తామన్నారు. హోంగార్డులందరికి కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లోనే ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ బిల్లు తెస్తామని కేసీఆర్ తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మీ పథకానికి కేటాయింపులను రూ.75,116కి పెంచామన్నారు. ►అప్పులు చెల్లించినా కొద్దీ తిరిగి అప్పుల లభిస్తాయి. దివాలా తీసిన వారికి అప్పులు ఇవ్వరు. ►మన రాష్ట్రంలో కూడా విద్యుత్ సంస్థలు ఉదయ్ పథకం కింద 12 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాం. ►ప్రత్యేక సమర్థతను ప్రతిపక్షాలు గుర్తించక పోయినా... ప్రజలు గుర్తిస్తున్నారు. ►ప్రతిపక్షాలు అక్కసుతో, నిందాపూర్వకంగా కాకుండా నిర్మాణాత్మకంగా విమర్శలు చేయవచ్చు. ►విద్యుత్ మిగులు దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఏడాది గడిస్తే... మిషన్ భగీరథ పూర్తైతే.. రాష్ట్రంలో మంచినీటి సమస్య పూర్తిగా కనుమరుగవుతుంది. ►ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేయడం ద్వారా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఆపేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ►ఈ కేసులు స్పీడ్ బ్రేకర్లు మాత్రమే... పూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ అడ్డుకోలేదు. ►రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, కోటి ఎకరాలకు నీరందిస్తాం. ►సమాజంలో దళిత, బీసీవర్గాల జనాభానే 90శాతం. అగ్రవర్ణాల 9.5శాతం మాత్రమే. ►దేశంలోనే 21శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ►నోట్లరద్దు జరిగినా మోటార్ వాహనాల రంగంలో మినహా... మిగతారంగాల్లో వృద్ధి రేటు తగ్గలేదు. ►ఐటీ ఎగుమతులు 75వేల కోట్లు దాటింది. ►తెలంగాణలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి. ప్రకృతిలో ఇవి అన్నిటికంటే గొప్ప సంపద. ►రెండేళ్లలో రాష్ట్రంలో 4లక్షల యాదవ కుటుంబాలకు 88 లక్షల గొర్రెలు అందిస్తాం. ►రెండేళ్లలో 4.5 కోట్ల గొర్రెల ఉత్పత్తి పెరుగుతుంది. ►యూనిట్ కు 21 గొర్రెలు పంపిణీ చేస్తాం. ►5వేలకు ఒక గొర్రెను అమ్ముకున్నా... 20వేల కోట్ల రూపాయల సంపద పెరుగుతుంది. ►7రాష్ట్రాల్లో పర్యటించి గొర్రెల కొనుగోలుకు కలెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ►రాష్ట్రంలో 60ఏళ్లలో గత ప్రభుత్వాలు 19 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే... మేం రెండేళ్లలో 190 బీసీ పాఠశాలలు ఏర్పాటు చేశాం. ►201మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాం. ►ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 100 శాతం రాజకీయ అవినీతి రూపుమాపాం. ►తప్పుడు ఆరోపణలు చేస్తే... కేసులు పెట్టేందుకు పటిష్టమైన చట్టం తేబోతున్నాం. ►ఎల్ అండ్ టీ ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గకుండా... విద్యుత్ రంగంలో బీహెచ్ ఇఎల్ కు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పనులు అప్పగించాం. ►మా ప్రభుత్వంలో కుంభకోణాలు లేవు. ఒక్క అవినీతి ఆరోపణ రుజువు చేసినా రాజీనామా చేస్తానన్న మాట చెప్పాను. ►టీఎస్ ఐపాస్ ద్వారా 15రోజుల ప్రాతిపదికన 3వేల 500 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం. ►పరిశ్రమలు పెడుతున్న వారే మాకు బ్రాండ్ అంబాసిడర్లు. ఈ సంస్థలు 43వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ►కిందిస్థాయిలో నైనా సరే... ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం. ►36వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం. ►ఒంటరి మహిళలకు కూడా వెయ్యి రూపాయల పింఛను ఇవ్వబోతున్నాం. ►ఇప్పటికీ కొందరు దరిద్రులు అంటరానితనం పాటిస్తున్నారు. ►వారి కష్టాలు తొలగించేందుకు కళాశాల స్థాయిలో దళిత విద్యార్థినులకు వసతిగృహాలు నిర్మించబోతున్నాం. ►చేనేత కార్మికులకు 50శాతం రాయితీపై నూలు, రసాయనాలు అందించబోతున్నాం. ►కనీసం 15వేల రూపాయల వేతనం అందించే ఏర్పాటు చేస్తున్నాం. ►చేనేత కార్మికుల ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ►30వేల క్షౌరశాలలకు 1లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. ►రజకులకు అధునాతన పరికరాలు, లాండ్రీలు ఏర్పాటు చేస్తాం ►95శాతం గుడుంబా నియంత్రించాం ►బతుకమ్మకు 34లక్షల మందికి బట్టలు పంపిణీ చేస్తాం. ►ఎంబీసీ కులాలకు వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ►ఎస్సీ, ఎస్టీ స్థానంలో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ బిల్లు పెట్టబోతున్నాం. ►ఎస్సీ, ఎస్టీ లతోపాటు ముస్లింలకు విదేశీ విద్యకు నిధులు అందిస్తాం. ►ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లు నేనే ప్రవేశ పెడుతా. ►ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. ►రాష్టంలో 21లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ల సామర్థ్యం అందుబాటులో ఉంది. ►రైతులకు విత్తనాలకు, పంట నిల్వకు సమస్య లేదు. ►హైవేల నిర్మాణంలో జాతీయ సగటును మించిపోయాం ►తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండొద్దన్నది మా ఉద్దేశం. ►24వేల మంది విద్యుత్, 23వేల మంది హోంగార్డులను క్రమబద్దీకరిస్తాం. ►108 కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్దీకరిస్తాం. ►546కోట్ల రూపాయలు బస్ పాసుల రుసుం ప్రభుత్వం చెల్లిస్తుంది. ►వచ్చే ఏడాది పాలమూరు జిల్లాలో 805లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ►1లక్ష 49వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించాలని కోరుతున్నాం. ►కాంగ్రెస్ పార్టీ రెండు రకాలుగా వ్యవహరిస్తోంది. ►కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించేందుకు కాంగ్రెస్ నేతలు వేసిన కేసులు అవరోధంగా ఉన్నాయి. ►వాటిని ఉపసంహరించాలని షబ్బీర్ అలీని కోరుతున్నాం. ►కోర్టు స్టేల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరుతున్నాం. -
ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
-
తెలంగాణ మండలి ప్రతిపక్షనేతగా షబ్బీర్!
-
పార్టీలు విలీనం కావాలి.. సభ్యులు విలీనం కావడమేమిటి?
హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పార్టీలు మాత్రమే విలీనం కావాలని.. ఎమ్మెల్సీలు విలీనం ఏమిటని రాఘవరెడ్డి ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రాఘవరెడ్డి.. మండలి ఛైర్మన్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరగాలని, న్యాయ, రాజ్యాంగ నిపుణులు స్పందించాలని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా గుర్తించినట్లు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ శాసనమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మహ్మద్ సలీంలు పార్టీలో విలీనం కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గుర్తించినట్లు సోమవారం మండలి సమావేశాలు సందర్భంగా ఛైర్మన్ స్వామిగౌడ్ పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగం 10 వ షెడ్యూల్ అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. దీనిపై రాజ్యాంగ నిపుణులు స్పందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
శాసన మండలిలో తీవ్ర గందరగోళం
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగంతుక నిధి పెంచాలని విపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. అయితే అధికార పక్షం మాత్రం ఇవేమీ పట్టించుకోక పోవడం.... ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. దాంతో ఛైర్మన్ పోడియం ముందు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో శాసనమండలిని ఛైర్మన్ ఆరగంట పాటు వాయిదా వేశారు. తెలంగాణ శాసనసభ, మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
నేడు అసెంబ్లీ, మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో సవరణల ద్వారా ఓటింగ్‌కు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు భావిస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే ఆ పార్టీలు విప్ జారీ చేశాయి. అలాగే కాగ్ నివేదికను కూడా ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలని అధికారపక్షం సభ్యులను ఆదేశించింది. రేపటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. -
4నెలల్లో రూ.2,500 కోట్ల విద్యుత్ కొనుగోలు
హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం శాసనమండలిలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నాలుగు నెల్లలో రూ.2,500 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశామని ఆయన సభ దృష్టికి తెచ్చారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అవసరం అయితే విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. గోదావరి బేసిన్‌పై విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రంలో అఖిలపక్షం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిధంగా ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఉన్నత విద్యా మండళ్ల భేటీలో సభ్యుల వాగ్వాదం
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉన్నత విద్యామండళ్ల చైర్మన్ల తొలి భేటీ ఆసాంతం వాడివేడిగా సాగింది. పలు అంశాలపై ఇరు మండళ్ల చైర్మన్లు, సభ్యు లు సహా వాగ్వివాదానికి దిగారు. ఏపీ మండలి తీరుపై తెలంగాణ మండలి తీవ్ర వేదన, నిరసన వ్యక్తం చేసింది. అయితే, తమ తీరు బాగానే ఉందని పరిధి లోబడే వ్యవహరిస్తున్నామని ఏపీ మండలి చైర్మన్ సర్దిచెప్పే యత్నం చేశారు. ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లూ పలు కీలక సమస్యలపై చర్చించినా.. అంతిమంగా నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వాలే కనుక ఆయా సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను చూపలేక పోయాయి. ఇరు మండళ్ల చైర్మన్లు ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాలరెడ్డి(ఏపీ), ప్రొఫెసర్ పి. పాపిరెడ్డి(తెలంగాణ), వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ విజయప్రకాశ్, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ వెంకటాచలం, కార్యదర్శులు కె. సతీష్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఏపీ మండలి డెప్యూటీ డైరక్టర్ కృష్ణమూర్తి, డెప్యూటీ సెక్రటరీ సూర్యప్రకాశరావు పాల్గొన్నారు. ► ఏపీ మండలి తీరుపై తెలంగాణ మండలి ఉపాధ్యక్షుడు మల్లేశం నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీ ఉన్నత విద్యామండలి ఆధిపత్య ధోరణితో వెళ్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనకు సొంతంగా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసినా ప్రభుత్వ సంస్థ అని కూడా చూడకుండా ఏపీ మండలి ఇష్టానుసారం వ్యవహరించడం సబబా?’ అని మండిపడ్డారు. ఏపీ మండలి సభ్యులు పెద్ద మనసుతో వ్యవహరించడం లేదని తెలంగాణ మండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ► పెద్దమనసుతోనే ఉన్నందునే టి.చైర్మన్‌ను సాదరంగా ఆహ్వానించామని ఏపీ మండలి వైస్ చైర్మన్ విజయప్రకాశ్, డెప్యుటీ డైరక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ► తమ పరిధి కాకపోయినా కార్యాలయంలో తెలంగాణ మండలి చైర్మన్‌కు, ఇతర ముఖ్యులకు చాంబర్లు కేటాయించేలా చేశామని, చైర్మన్‌కు కారు, అటెండర్లను ఇచ్చామని తెలిపారు. నిధులు, సిబ్బంది, భవనాలు, వాహనాలు తదితర అంశాలపై ఇరు మండళ్ల సభ్యులు చర్చించారు. ► మండలి కార్యకలాపాలకోసం రూ.2 కోట్లు కావాలని ప్రతిపాదనలు పం పినా ఏపీ అధికారులు పట్టించుకోలేదని తెలంగాణ మండలి సభ్యులు ఆరోపిం చారు. సదరు ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, నిధులు అత్యవసరమైన పక్షంలో మరో రూపంలో సమీకరించుకోవాలని ఏపీ మండలి చెప్పింది. -
మండలి చైర్మన్ పదవికి స్వామిగౌడ్ నామినేషన్
హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వామిగౌడ్ నామినేషన్‌కు ఎంఐఎం మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని నరసింహరావు, మంత్రులు హరీశ్‌రావు, కేటీ రామారావు, ఈటెల రాజేందర్, పద్మారావుతోపాటు టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్సీలు హాజరు అయ్యారు. బుధవారం నుంచి మండలి సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశంలో శాసనమండలి చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. మరోవైపు చైర్మన్ అధ్యక్ష స్థానానికి కాంగ్రెస్ తరపున ఫారుఖ్ హుస్సేన్ నామినేషన్ వేయనున్నారు. -
అమరవీరులకు మండలి సంతాపం
సభ్యులతో ప్రమాణం చేయించిన చైర్మన్ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా: మహమూద్‌అలీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం అమరులైన వీరులకు శాసన మండలి సంతాపం ప్రకటించింది. జూబ్లీహాల్లో ఏర్పాటైన తెలంగాణ మండలి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావు తొలుత ఎమ్మెల్సీలతో మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెండు నిమిషాల పాటు అమరవీరులకు మండలి సభ్యులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారికి రాష్ట్ర ఏర్పాటును అంకితం చేస్తూ సంతాప తీర్మానాన్ని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ప్రవేశపెట్టగా, విపక్షనేత డి.శ్రీనివాస్ బలపరిచారు. 33 మంది సభ్యులకుగాను సోమవారం 31 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాలేదు.అధికారిక చిహ్నంలో ఉర్దూ భాష లేనందున తాను ప్రమాణ స్వీకారం చేయనని షబ్బీర్ అలీ ప్రకటించారు. అయితే, ఈ విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ హామీ ఇవ్వడంతో చివరగా షబ్బీర్ ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల హామీ మేరకు అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహమూద్ ప్రకటించారు. చివరికి సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.