హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం శాసనమండలిలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నాలుగు నెల్లలో రూ.2,500 కోట్లు విద్యుత్ కొనుగోలు చేశామని ఆయన సభ దృష్టికి తెచ్చారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అవసరం అయితే విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తామని హరీష్ రావు తెలిపారు. గోదావరి బేసిన్పై విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టులకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్రంలో అఖిలపక్షం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిధంగా ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.