చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయండి: హరీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలకు తెలంగాణ మంత్రి హారీష్ రావు సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంత విద్యుత్ వస్తుందో అనే అంశంపై తెలుగు తమ్ముళ్లు చర్చకు సిద్ధమా అంటూ హరీష్ సవాల్ విసిరారు.
తెలంగాణలో విద్యుత్ సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదని, ఆయన కార్యాలయం ముందు ధర్నా చేపట్టడానికంటే చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేయండని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు కారణం చంద్రబాబు అంటూ హరీష్ ఆరోపించారు.