
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడంపై టీ కాంగ్రెస్ నేతలు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ సుత్రాలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరిస్తున్నారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుముందు స్వామిగౌడ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశారు.
మరోవైపు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్ మండలి ఛైర్మన్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరడానికి గల కారణాలను ఆయనకు వివరించారు. ఇటీవల రాములు నాయక్‌కు టీఆర్‌ఎస్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment