‘రెండో కాశ్మీర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా’ | Adilabad District turns Second Kashmir, says Swamy Goud | Sakshi
Sakshi News home page

‘రెండో కాశ్మీర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా’

Published Tue, Jul 29 2014 1:29 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

‘రెండో కాశ్మీర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా’ - Sakshi

‘రెండో కాశ్మీర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా’

ఆదిలాబాద్: జిల్లాలోని కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి కొమురంభీమ్ స్మృతివనం ఏర్పాటు చేసేలా ప్రణాళికలో పొందుపర్చినట్లయితే ఆదిలాబాద్ జిల్లా రెండో కాశ్మీర్‌గా అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలసి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉద్యోగసంఘాల నాయకులు ఆయనను సన్మానించారు. 

అనంతరం, జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జెడ్పీ అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మన జిల్లా.. మన ప్రణాళిక..’కు ఆమోదం తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా స్వామిగౌడ్ హాజరై మాట్లాడుతూ.. వనరులు, అడవులను సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్ తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement