
రియాద్ : భారత్‌తో 2019 ఎన్నికల తర్వాత సంబంధాలపై చర్చలు ప్రారంభిస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తాను ప్రయత్నింతిస్తున్నానని చెప్పారు. కానీ భారత్ నుంచి సానుకూల స్పందన రాలేదని వెల్లడించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో పెట్టుబడుల సమాఖ్య సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఎల్లప్పుడు పొరుగు దేశాలతో శాంతినే కోరుకుంటుందన్నారు. ముఖ్యంగా భారత్, అప్గానిస్తాన్‌లతో శాంతియుత సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించారు. తమ దేశానికి ప్రస్తుతం శాంతి, భద్రత కావాలని ఆయన అన్నారు.
గత నెల సెప్టెంబర్‌లో భారత్ - పాక్‌ల మధ్య జరగాల్సిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశాన్ని భారత్ రద్దు చేసుకుంది. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్‌కు చెందిన భద్రతా సిబ్బందిని తీసుకెళ్లి హత్యచేసినందుకు నిరసనగా భారత్ ఆ సమావేశాన్ని బహిష్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment