
శ్రీనగర్: ఉగ్రవాద కార్యకలాపాల్ని తక్షణం ఆపివేయాలని హోం మంత్రి రాజ్‌నాథ్ పాక్‌ను కోరారు. కశ్మీర్, పాక్‌లో కశ్మీర్ అంశంపై సరైన ఆలోచన ఉన్న అందరితో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కశ్మీర్‌లో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. చర్చలకోసం గతేడాది అక్టోబరులోనే కేంద్ర ం ప్రత్యేక ప్రతినిధిని నియమించిందని గుర్తు చేశారు. కశ్మీర్‌లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణను రంజాన్ వరకు పొడిగించే వీలుందన్నారు. పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన ఘటనల్లో పాల్గొన్న యువతపై కేసుల్ని ఉపసంహ రించుకోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని యువతను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని, అయితే చిన్నపిల్లలు తప్పులు చేయడం సహజమని ఆయన అన్నారు.