'ఉగ్రవాద కట్టడికి పాక్ సహకరించాలి' | Pak should help tackle terror: Rajnath | Sakshi
Sakshi News home page

'ఉగ్రవాద కట్టడికి పాక్ సహకరించాలి'

Published Sun, May 24 2015 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

'ఉగ్రవాద కట్టడికి పాక్ సహకరించాలి'

'ఉగ్రవాద కట్టడికి పాక్ సహకరించాలి'

లక్నో: ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్థాన్ తమకు అన్ని విధాల సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కోరారు. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అయినందువల్ల ఇప్పటికే ఆ దేశం టెర్రిరిజాన్నిఅంతమొందించేందుకు పూనుకుంటే మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాదుల ద్వారానే ఉగ్రవాదులను తటస్థీకరించాలని అని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్న మాటలపై స్పందిస్తూ ఒక భారతదేశానికే కాదు.. మొత్తం ప్రపంచానికే తెలుసు ఎవరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే విషయం అని బదులిచ్చారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ అన్నివిధాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశానికి బ్యాంకులే వెన్నెముక అని ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ (ఎఫ్ఐసీఎన్) రాకెట్ విషయంలో అవి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement