ఇజ్రాయెల్ కాల్పులను ఏకపక్షంగా విరమించడంతో సోమవారం ఉదయం కాసేపు గాజాలో ప్రశాంతత నెలకొంది. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే గాజాపై సైనిక చర్యలను తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.
గాజాపై దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్
జెరూసలేం/గాజా: ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో సోమవారం కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్.. ఆ మర్నాడే పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఆధీనంలోని గాజాపై వైమానిక దాడులను కొనసాగించింది. ‘కాల్పుల విరమణలో భాగంగా గాజాపై మేం కాల్పులు ఆపేసిన తరువాత హమస్ మాపై 47 రాకెట్లను ప్రయోగించింది. దాంతో మళ్లీ దాడులను ప్రారంభించాల్సి వచ్చింది’ అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈజిప్ట్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న హమాస్ కూడా మంగళవారం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను తీవ్రం చేసింది.
ఇజ్రాయెల్ కాల్పులను ఏకపక్షంగా విరమించడంతో సోమవారం ఉదయం కాసేపు గాజాలో ప్రశాంతత నెలకొంది. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే గాజాపై సైనిక చర్యలను తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. కాగా.. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో పలు పార్టీలు సోమవారం లోక్‌సభను హోరెత్తించాయి. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు ఒప్పుకోలేదు.