జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో కాల్పుల విషయంలో ఇజ్రాయెల్ మరో కీలక ప్రకటన చేసింది. రఫాలో పగటి పూట(దాదాపు 11 గంటల పాటు) కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, గాజా ప్రజలకు మానవతాసాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
కాగా, రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వనున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందింందే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కాల్పుల విరామం ప్రకటించింది. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంతో కొన్ని వారాలుగా మానవతా సాయం అందక ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు ఊరట లభించింది.
ISRAEL-HAMAS WAR
Israeli army announces "#Tactical #Pause" in part of southern #GAZA strip during daylight hours to facilitate the delivery of aid pic.twitter.com/iDk5caNJnG— Alberto Allen (@albertoallen) June 16, 2024
అయితే, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న రోడ్డు వెంబడి మాత్రమే కాల్పుల విరమణ కొనసాగనుంది. ఇక, తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కాల్పులు విరామం కొనసాగనున్నట్టు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కెరోమ్ షాలోమ్ క్రాసింగ్ దగ్గర వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్-అల్-దిన్ రోడ్డు మార్గం నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా ఉత్తర గాజాతో పాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా మానవతాసాయం అందనుంది.
ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ ప్రకటనను సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు ఖండిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో శనివారం ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment