Hamas bases
-
హమాస్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో 71 మరణాలు
జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్ కీలక నేతలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 71 మంది మృతిచెందారు. మరో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.కాగా, హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా తాజాగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 71 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇదే సమయంలో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. అయితే, ఈ దాడిలో హమాస్ నేతల ప్రస్తుత పరిస్థితి మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి. Gotcha!#Hamas military commander & architect of the Oct7 atrocities, Mohammed Deif, is no longer a problem. pic.twitter.com/JhXFVy7Lne— ✡Israel and Stuff✡🎗️ (@IsraelandStufff) July 13, 2024 ఇదిలా ఉండగా.. ఉత్తర రఫా నుంచి ఖాన్ యూనిస్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వేలాదిమంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రాంతంపైనే ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యమే గతంలో ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా గుర్తించి, నిరాశ్రయులు అక్కడే ఆశ్రయం పొందాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి. -
పాలస్తీనియన్లకు భారీ ఊరట.. ఇజ్రాయెల్‌కు కీలక ప్రకటన
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో కాల్పుల విషయంలో ఇజ్రాయెల్ మరో కీలక ప్రకటన చేసింది. రఫాలో పగటి పూట(దాదాపు 11 గంటల పాటు) కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, గాజా ప్రజలకు మానవతాసాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కాగా, రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వనున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందింందే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కాల్పుల విరామం ప్రకటించింది. ఇక, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంతో కొన్ని వారాలుగా మానవతా సాయం అందక ఇబ్బందులు పడుతున్న గాజా ప్రజలకు ఊరట లభించింది.ISRAEL-HAMAS WARIsraeli army announces "#Tactical #Pause" in part of southern #GAZA strip during daylight hours to facilitate the delivery of aid pic.twitter.com/iDk5caNJnG— Alberto Allen (@albertoallen) June 16, 2024అయితే, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో 12 కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న రోడ్డు వెంబడి మాత్రమే కాల్పుల విరమణ కొనసాగనుంది. ఇక, తదుపరి నోటీసులు ఇచ్చే వరకు కాల్పులు విరామం కొనసాగనున్నట్టు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కెరోమ్ షాలోమ్ క్రాసింగ్ దగ్గర వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్-అల్-దిన్ రోడ్డు మార్గం నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా ఉత్తర గాజాతో పాటుగా మరికొన్ని ప్రాంతాలకు కూడా మానవతాసాయం అందనుంది.ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ ప్రకటనను సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నేతలు ఖండిస్తున్నారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మానవతా సాయం అందివ్వడానికి యుద్ధానికి విరామం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో శనివారం ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. -
ఇజ్రాయెల్ దాడి సక్సెస్.. హమాస్ టాప్ కమాండర్ హతం!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ మర్వాన్ ఇస్సా మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు. ఈ అంశంపై జేక్ సలివన్ తాజాగా మాట్లాడుతూ..‘హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లపై దాడులు చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సా మృతిచెందాడు. మిగతా టాప్ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారు’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల వేల సంఖ్యలో పౌరులు, హమాస్ నేతలు మృత్యువాడపడ్డారు. కాగా, సెంట్రల్ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. దీంతో, ఇస్సా మృతి ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు. U.S. National Security Advisor, Jake Sullivan has announced that according to recent Intelligence an Israeli Airstrike on March 11th resulted in the Successful Elimination of Marwan Issa, the Deputy Commander of Hamas’s Al-Qassam Brigades and Right-Hand Man to Mohammed Deif. pic.twitter.com/4w2Tg65ias — Narendra Maurya (@narendra483) March 19, 2024 అయితే, హమాస్ మిలిటరీ అధిపతి మహమ్మద్ దీఫ్ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. మిలిటరీ కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురుకుగా ఉండేవాడని, అక్టోబర్ 7 నాటి మారణకాండలో కీలకపాత్ర పోషించాడని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు.. ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియేల్ హగరీ పేర్కొన్నారు. “Hamas’ number three, Marwan Issa, was killed in an Israeli operation last week,” Jake Sullivan, President Biden’s national security adviser at a White House briefing 3/18/2024 4:20 PM PDT pic.twitter.com/pPtJSyltfi — Boaz Guttman בועז גוטמן (@boazgu1) March 18, 2024 -
ఇజ్రాయెల్ అరాచకం.. హమాస్ అగ్రనేత కుమారుడు మృతి!
గాజా: గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇక, తాజాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే(22) కూడా మృతి చెందినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు తీవ్రతరం చేసింది. హమాస్ నేతలే టార్గెట్ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ అగ్రనేత కుమారుడు హజెం హనియే (22) మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో అతడు చనిపోయాడని స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, హజెం హనియే ప్రస్తుతం ఓ కాలేజీలో విద్యార్థిగా ఉన్నట్టు సమాచారం. 🚨🇵🇸 BREAKING: SON OF #HAMAS LEADER KILLED IN AN IDF STRIKE Unconfirmed reports indicate The son of Ismail Haniyeh, 22-year-old Hazim Haniyeh, head of Hamas’s political bureau, has reportedly been killed by a succession of Israeli air strikes. pic.twitter.com/WCqLTxsKmu — Geopolitical Kid (@Geopoliticalkid) February 11, 2024 మరోవైపు.. రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. తాజాగా ఇజ్రాయెల్ దాడిలో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి. ఇక, గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. తాజాగా అక్కడ కూడా దాడులు ప్రారంభం కావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. రఫాపై ఇజ్రాయెల్ దాడులను అమెరికా సహా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామలు ఉంటాయని సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. Missiles fired into Israel from Lebanon. All of them rebuffed by the Iron Dome system. Israel is under constant attack and yet is demonised for defending itself by liberals safely in the West. The double standards are galling. pic.twitter.com/Azgb43Bnah — Bella Wallersteiner 🇺🇦 (@BellaWallerstei) February 10, 2024 -
గాజా, సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
500 కు చేరిన గాజా మృతుల సంఖ్య
జెరూసలేం: గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా గగన, భూతలాల నుంచి ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు రోజూకు తీవ్ర రూపం దాల్చుతున్న ఈ దాడులు వందల సంఖ్యల అమాయకుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. గత 14 రోజులుగా ఇజ్రాయిల్ సైన్యం జరుపుతున్న దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 500కు చేరింది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటిదాకా 18 మంది సైనికులతో సహా ఇద్దరు ఇజ్రాయెలీలు చనిపోగా, 10 మంది పాలస్తీనియన్ మిలిటెంట్లు మృతి చెందారు. దీంతో దాడుల్లో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 508 ఉండవచ్చని ఇజ్రాయిల్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర గాజాలోని సొరంగ మార్గం ద్వారా మిలిటెంట్లు దాడులు చేయడానికి యత్నాలు ఆరంభించాడాన్ని ఇజ్రాయిల్ కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మంగళవారం జరూసలేంకు బయల్దేరి వెళ్లి అక్కడ ఇజ్రాయిల్ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. -
ఇజ్రాయెల్ దాడుల్లో 90 మంది మృతి
425కు చేరిన పాలస్తీనా మృతుల సంఖ్య గాజా/జెరూసలెం: గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా గగన, భూతలాల నుంచి ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో ఆదివారం ఒక్కరోజే 90 మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో 13 రోజులుగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 425కు చేరింది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటిదాకా ఐదుగురు సైనికులతో సహా ఏడుగురు ఇజ్రాయెలీలు చనిపోయారు. పరిస్థితి భీకరంగా మారిన నేపథ్యంలో మృతదేహాలు, క్షతగాత్రుల తరలింపు కోసం మానవతా దృక్పథంతో తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలంటూ రెడ్‌క్రాస్‌కు చెందిన అంతర్జాతీయ కమిటీ చేసిన విజ్ఞప్తికి ఇరుపక్షాలూ అంగీకరించాయి. అయితే హమాస్ మిలిటెంట్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని, తామూ అందుకు అనుగుణంగా స్పందించామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. షాజైయా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెలీ బలగాలు తూటాల వర్షం కురిపించడంతో వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గాజా సిటీలోకి పారిపోయారు. జీతున్, జబాలియా ప్రాంతాల్లో ఇజ్రాయెలీ సేనలు అపార్ట్మెంట్ భవనాల్లోకి నేరుగా కాల్పులు జరపడంతో వేలాది మంది భయకంపితులయ్యారు. శుక్రవారం రాత్రి రఫా వద్ద హమాస్ మిలిటెంట్లు ఓ గాడిదకు పేలుడు పదార్థాలను కట్టి ఇజ్రాయెల్ బలగాల వైపు పంపించగా.. ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరిపి దానిని పేల్చివేశారు. కాగా, ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడుల్లో చనిపోయినవారిలో 112 మంది మైనర్లు, 41 మంది మహిళలు, 25 మంది వృద్ధులు ఉన్నారు. -
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
337కు చేరిన మృతుల సంఖ్య ఆశ్రయం కోల్పోయిన 40 వేలమంది పాలస్తీనియన్లు గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లకు చెందిన హమాస్ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటుగా భూతల దాడులనూ ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు అంతకంతకూ గాజా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. గాజాలోని ఒక ఇంటిపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని సైనికులు హతమార్చారని, మిగతావారు వెనుదిరిగి గాజా ప్రాంతంలోకి పరారయ్యారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ 12 రోజులుగా జరుపుతున్న దాడులతో మృతుల సంఖ్య 337కు చేరింది. దాడులతో 40 వేలమందికి పైగా పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. ఇరుపక్షాలను కాల్పుల విరమణకు ఒప్పించేందుకు, సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, దౌత్యవేత్తలు సన్నద్ధమయ్యారు. పశ్చిమాసియాకు మూన్ పయనమవుతున్నారు. మరోవైపు ఘర్షణ తీవ్రతరమై గాజా ప్రాంతంలో పరిస్థితి మరింత విషమించింది. ఉభయపక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టం నిబంధనలను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సహాయ, కార్యకలాపాల సంస్థ సూచించింది.