వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ మర్వాన్ ఇస్సా మృతిచెందాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలివన్ ప్రకటించారు.
ఈ అంశంపై జేక్ సలివన్ తాజాగా మాట్లాడుతూ..‘హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లపై దాడులు చేయడమే కాకుండా టాప్ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ గ్రూప్ మూడో ర్యాంక్ కమాండర్ మార్వాన్ ఇస్సా మృతిచెందాడు. మిగతా టాప్ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారు’ అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల వేల సంఖ్యలో పౌరులు, హమాస్ నేతలు మృత్యువాడపడ్డారు. కాగా, సెంట్రల్ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. దీంతో, ఇస్సా మృతి ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు.
U.S. National Security Advisor, Jake Sullivan has announced that according to recent Intelligence an Israeli Airstrike on March 11th resulted in the Successful Elimination of Marwan Issa, the Deputy Commander of Hamas’s Al-Qassam Brigades and Right-Hand Man to Mohammed Deif. pic.twitter.com/4w2Tg65ias
— Narendra Maurya (@narendra483) March 19, 2024
అయితే, హమాస్ మిలిటరీ అధిపతి మహమ్మద్ దీఫ్ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. మిలిటరీ కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురుకుగా ఉండేవాడని, అక్టోబర్ 7 నాటి మారణకాండలో కీలకపాత్ర పోషించాడని ఇజ్రాయెల్ భావిస్తోంది. మరోవైపు.. ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియేల్ హగరీ పేర్కొన్నారు.
“Hamas’ number three, Marwan Issa, was killed in an Israeli operation last week,” Jake Sullivan, President Biden’s national security adviser at a White House briefing 3/18/2024 4:20 PM PDT pic.twitter.com/pPtJSyltfi
— Boaz Guttman בועז גוטמן (@boazgu1) March 18, 2024
Comments
Please login to add a commentAdd a comment