టెల్‌అవీవ్:తమ దేశంపై 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడుల వెనుక కీలకంగా వ్యవహరించిన హమాస్ కమాండర్ అల్‌హదీసబాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో శరణార్థులు సహాయం పొందుతున్న ప్రాంతంలో సబాను గుర్తించామని,డ్రోన్ దాడితో అతడిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వెల్లడించింది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఇ కిబ్జట్ నిర్ ఓజ్‌లో హమాస్ జరిపిన దాడిలో అబ్ద్ అల్ హదీ సబా కీలక సూత్రధారని తెలిపింది. యూదులు టార్గెట్‌గా అల్‌హదీసబా దాడులు చేశాడని పేర్కొంది. సబా నేతృత్వంలో డజన్ల కొద్ది మందిని కిడ్నాప్ చేయడంతో పాటు హత్య చేశారని ఆరోపించింది. ఇప్పటికే హమాస్ అగ్ర నేతలు పలువురిని ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే.
కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వందల కొద్ది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలువురిని హమాస్ తన వెంట బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో 45 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు:జిన్‌పింగ్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment