జెరూసలేం: ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హమాస్ కీలక నేతలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో 71 మంది మృతిచెందారు. మరో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది.
కాగా, హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా తాజాగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 71 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇదే సమయంలో మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. అయితే, ఈ దాడిలో హమాస్ నేతల ప్రస్తుత పరిస్థితి మాత్రం తెలియడం లేదు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి.
Gotcha!#Hamas military commander & architect of the Oct7 atrocities, Mohammed Deif, is no longer a problem. pic.twitter.com/JhXFVy7Lne
— ✡Israel and Stuff✡🎗️ (@IsraelandStufff) July 13, 2024
ఇదిలా ఉండగా.. ఉత్తర రఫా నుంచి ఖాన్ యూనిస్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వేలాదిమంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రాంతంపైనే ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యమే గతంలో ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా గుర్తించి, నిరాశ్రయులు అక్కడే ఆశ్రయం పొందాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment