జెరూసలేం: గాజాలోని హమాస్ స్థావరాలు లక్ష్యంగా గగన, భూతలాల నుంచి ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు రోజూకు తీవ్ర రూపం దాల్చుతున్న ఈ దాడులు వందల సంఖ్యల అమాయకుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. గత 14 రోజులుగా ఇజ్రాయిల్ సైన్యం జరుపుతున్న దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 500కు చేరింది.
మరోవైపు హమాస్ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటిదాకా 18 మంది సైనికులతో సహా ఇద్దరు ఇజ్రాయెలీలు చనిపోగా, 10 మంది పాలస్తీనియన్ మిలిటెంట్లు మృతి చెందారు. దీంతో దాడుల్లో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 508 ఉండవచ్చని ఇజ్రాయిల్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర గాజాలోని సొరంగ మార్గం ద్వారా మిలిటెంట్లు దాడులు చేయడానికి యత్నాలు ఆరంభించాడాన్ని ఇజ్రాయిల్ కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మంగళవారం జరూసలేంకు బయల్దేరి వెళ్లి అక్కడ ఇజ్రాయిల్ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది.