ఇజ్రాయెల్‌ అరాచకం.. హమాస్‌ అగ్రనేత కుమారుడు మృతి! | Hamas Leader Son Hazem Haniyeh Killed In Israeli Attacks In Gaza, Say Reports - Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ అరాచకం.. హమాస్‌ అగ్రనేత కుమారుడు మృతి!

Published Sun, Feb 11 2024 11:40 AM | Last Updated on Sun, Feb 11 2024 1:42 PM

Hamas Leader Son killed In Israeli Attacks In Gaza - Sakshi

గాజా: గాజా సిటీపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌ భీకర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇక, తాజాగా హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే కుమారుడు హజెం హనియే(22) కూడా మృతి చెందినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు తీవ్రతరం చేసింది. హమాస్‌ నేతలే టార్గెట్‌ ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హమాస్‌ అగ్రనేత కుమారుడు హజెం హనియే (22) మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో అతడు చనిపోయాడని స్థానిక మీడియాతో పాటు ఇజ్రాయెల్‌ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, హజెం హనియే ప్రస్తుతం ఓ కాలేజీలో విద్యార్థిగా ఉన్నట్టు సమాచారం. 

మరోవైపు.. రఫా నగరంపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. తాజాగా ఇజ్రాయెల్‌ దాడిలో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. ఈ నగరంలో 14 లక్షల మంది జీవిస్తున్నారని అంచనా. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహు ఆదేశించిన కాసేపటికే దాడులు ప్రారంభమయ్యాయి. ఇక, గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షలాది మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. తాజాగా అక్కడ కూడా దాడులు ప్రారంభం కావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. రఫాపై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికా సహా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామలు ఉంటాయని సౌదీ అరేబియా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement