Mysterious Z Symbol In Russia Military Vehicles మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా వార్ కొనసాగుతోంది. ఈ యుద్దంలో రష్యా అత్యాధునిక బాంబులను, క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తోంది. రష్యా ధాటికి ఉక్రెయిన్‌లో పెద్ద పెద్ద భవనాలు సైతం కుప్పకూలిపోతున్నాయి. వార్ ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యుద్దం సందర్బంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన పలు సైనిక వాహనాలు, యుద్ద ట్యాంకర్లపై ‘z’ గుర్తు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.
‘z’ గుర్తు స్పెషాలిటీ ఇదే..
ఈ ‘z’ గుర్తు ఉన్న వాహనాలను రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. వీటికి రష్యా జాతీయ భద్రతా దళం అనే మరో పేరు కూడా ఉంది. కాగా, ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ కేవలం రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతా వ్యవహారాలనే మాత్రమే చూస్తుంటాయి. వీరందరూ ఎంతో నైపుణ్యంతో కూడిన ట్రైనింగ్ తీసుకొని యుద్దం రంగంలో ఎంతో చాకచక్యంగా విధులను నిర్వర్తిస్తారనని తెలుస్తోంది. ఏ ప్రదేశంలోనైనా చొరబడి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శక్తి ఈ బలగాలకు ఉంటుందని పలువురు ప్రముఖులు అంటున్నారు. దీంతో యుద్ధంలో ఈ గుర్తు ఉన్న వాహనాలు కనిపించడంతో రష్యా ఆ ట్రూప్స్‌ను కూడా వార్‌లోకి దింపిందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Russian tanks marked with 'Z' zip down streets of Melitopol, Ukraine. #RussiaUkraineConflict #UkraineRussiaCrisis #WWIII pic.twitter.com/lVGV3I4ZpW
— NewsReader (@NewsReaderYT) February 25, 2022
ఇదిలా ఉండగా ఈ గుర్తుపై మరో వాదన కూడా ఉంది. కేవలం యుద్దం జరుగుతున్న సమయంలో ఇదో రకమైన కమ్యూనికేషన్ సిగ్నల్ అని కొందరు అంటున్నారు. రష్యా ట్రూప్‌పై వారి దేశానికి చెందిన యుద్ద వాహనాలు కాల్పులు జరపకుంగా ఈజీగా గుర్తు పట్టేందుకే ఇలా గుర్తులు వాడుతారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, బెలారస్‌లో రష్యాకు చెందిన మరికొన్ని యుద్ద వాహనాలపై ‘O’ గుర్తు కలిగిన వాహనాలు కూడా కనిపించినట్టు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment